అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి (Venkateswara Swamy) వారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సెలవు రోజులు, ప్రత్యేక పర్వ దినాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం, శనివారం శ్రీకృష్ణాష్టమి, ఆదివారం వరుస సెలవులు రావడంతో స్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు (Devotees) వచ్చారు.
Tirumala | 48 గంటల సమయం
తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసిపోయింది. దీంతో భక్తులు శ్రీవారి దర్శనానికి బారులు తీరారు. కంపార్ట్మెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్ ఉంది. స్వామి వారి దర్శనానికి రెండు రోజుల సమయం పడుతుంది. దర్శనానికి 48 గంటల సమయం పడుతుందని అధికారులు మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారు. దీంతో పలువురు భక్తులు కొండ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.