అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Pakistan | భారత్ (Bharat) చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాకిస్తాన్ బుద్ధి మారలేదు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన (Pak Independence day) కూడా తన ట్రేడ్మార్క్ అబద్ధాలతో పరువు తీసుకుంది. ఇండియాతో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో విజయం సాధించినట్లు ప్రచారం చేసుకోవడమే కాదు, ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ ఏకంగా 488 మందికి అవార్డులు అందజేసింది. ఇస్లామాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pak PM Shehbaz Sharif).. ఇండియాతో గత మే నెలలో జరిగిన యుద్ధంలో (India – Pak war) సాధించిన “విజయాలకు” పౌర, సైనిక అధికారులపై పతకాల వర్షం కురిపించారు.
Pakistan | అదే హాస్యాస్పదం
ఇండియాకు చెందిన S-400 వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశారని చెబుతూ అవార్డు అందజేయడం పాక్ చెబుతున్న దాంట్లో అన్నింటికంటే హాస్యాస్పదంగా మారింది. S-400 వైమానిక రక్షణ వ్యవస్థను “ధ్వంసం” చేశారంటూ వింగ్ కమాండర్ మాలిక్ రిజ్వాన్-ఉల్-హక్ ఇఫ్తిఖర్ ను సత్కరించారు. పాక్ ప్రధాని స్వయంగా ఈ అవార్డును అందజేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయింది.
Pakistan | అవార్డుల పంట..
స్వాతంత్య్ర దినోత్సవాలను అవార్డుల పంపిణీ వేడుకగా మార్చేశారు.. పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నేవీ నుంచి మొత్తం 488 మంది సిబ్బందికి అవార్డులు అందించారు. సితారా-ఎ-జురాత్ నుంచి తమ్ఘా-ఇ-బసలత్ వరకు, COAS ప్రశంసా పత్రాల నుండి నిషాన్-ఎ-ఇంతియాజ్ వరకు పతకాలు కన్ఫెట్టిలా ప్రవహించాయి. ISI చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ అసిమ్ మాలిక్, ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరికి కూడా సితారా-ఇ-బసలత్ బహుమతి లభించింది, మీడియా బ్రీఫింగ్ చేసిన ప్రతినిధులు ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్, వైస్ అడ్మిరల్ రాజా రబ్ నవాజ్ కూడా పతకాలతో సత్కరించడం గమనార్హం.
అంతే కాదు, మంత్రులకు సైతం అవార్డులు ఇవ్వడం విశేషం. ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ, విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. మొత్తంగా పాకిస్తాన్ వైఫల్యాలను “విజయాలు”గా మార్చిన ప్రతి ఒక్కరికీ అవార్డు లభించింది.