అక్షరటుడే, ఇందూరు: Heavy Rains | ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి (old building collapsed). నగరంలోని బ్రహ్మపురి కాలనీలో ఓ పాత భవనం కూలింది. ఇంటి బయట వైపు గోడ కూలీ రోడ్డుపై పడింది. ఆ సమయంలో అటువైపు ఎవరు వెళ్లకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ అధికారులు (municipal corporation officials) వివరాలు నమోదు చేసుకున్నారు. జేసీబీతో ప్రమాదం ఉన్న గోడని కూల్చి తొలగించారు. కాంగ్రెస్ డివిజన్ ఇన్ఛార్జి అవిన్ ధర్మారం దగ్గరుండి పర్యవేక్షించారు.
Heavy Rains | కూలిన డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ
అక్షరటుడే, కామారెడ్డి: Heavy Rains | గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Kamareddy Government Degree College) ప్రహరీ గోడ శనివారం కూలిపోయింది. అటువైపు మెడికల్ కళాశాలకు వెళ్లే దారి ఉండడంతో పాటు కాలనీవాసుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇప్పటి వరకు మూడుసార్లు కూలిపోవడం వల్ల కాకతీయనగర్ కాలనీ, 14వ వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ మాజీ ఛైర్మన్ గడ్డం ఇందుప్రియ (Gaddam Indupriya) కూలిన గోడను పరిశీలించారు. గోడ కూలడంతో సత్వరమే మున్సిపల్ అధికారులకు, డిగ్రీ కళాశాల, శిశు మందిర్ సిబ్బందికి సమాచారం అందించారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్కు ఫోన్లో వివరించగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు సమావేశమై పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని కోరారు.