అక్షరటుడే, కామారెడ్డి: IVF National Award | కామారెడ్డి వాసికి జాతీయ పురస్కారం (national award) లభించింది. జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ (IVF Seva Dal( రాష్ట్ర ఛైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడంతో పాటు వ్యక్తిగతంగా 77 సార్లు రక్తదానం చేశారు.
దీంతో ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని ఈ నెల 19న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla), కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో (New Delhi) అందుకోనున్నారు. అవార్డును అందుకోవడానికి సహకరించిన ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలకు బాలు కృతజ్ఞతలు తెలిపారు.