అక్షరటుడే, నిజాంసాగర్ : Sub-Collector Kiranmayi | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. డోంగ్లి మండలంలోని (Dongli mandal) లింబురువాడి వాగు పొంగిపొర్లుతూ రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో శనివారం సబ్ కలెక్టర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్థులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పా బయటకు వెళ్లకూడదని సూచించారు. వరద ప్రవాహాన్ని అంచనా వేయకుండా వాగులలో ప్రయాణించవద్దని చెప్పారు. నీటి ప్రవాహాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూడాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ఆర్ఐ సాయిబాబా (RI Sai Baba), వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Sub-Collector Kiranmayi | మాదాపూర్ కల్వర్టును పరిశీలించిన అధికారులు
జుక్కల్ మండలంలోని (Jukkal mandal) మాదాపూర్‌లో చిన్న కల్వర్టు పైనుంచి వరద నీరుపారుతోంది. దీంతో శనివారం ఎంపీడీవో శ్రీనివాస్‌తో పాటు గ్రామ పంచాయతీ అధికారులు (village panchayat officials) ఈ ప్రాంతాన్ని సందర్శించారు. రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అటువైపు వెళ్లకుండా దారికి అడ్డంగా అధికారులు ట్రాక్టర్ ట్రాలీని ఏర్పాటు చేశారు.
Sub-Collector Kiranmayi | గ్రామంలోకి వరద నీరు
భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా.. మద్నూర్ మండలం చిన్న ఎక్లార వద్ద గల వాగుకు భారీగా వరద నీరు రావడంతో గ్రామంలోకి నీళ్లు వచ్చాయి. ఆలయం, తాగునీటి ట్యాంక్ (drinking water tank) సమీపంలో నుంచి గ్రామంలోని వీధుల్లోకి నీరు రావడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు.
Sub-Collector Kiranmayi | నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కాసుల
నిజాంసాగర్ ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ (Agro Industries Chairman Kasula Balaraj) శనివారం సందర్శించారు. ప్రాజెక్టులోకి భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ఆయన ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ సాకేత్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు మధుసూదన్, గోపాల్ రెడ్డి, హాలిక్ తదితరులున్నారు.