అక్షరటుడే, కామారెడ్డి: CPM State Secretary | సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (CPM State Secretary John Wesley) ఈ నెల 19న కామారెడ్డికి రానున్నారని జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
పట్టణంలోని మున్నూరు కాపు సంఘం కల్యాణ మండపంలో నిర్వహించే పార్టీ అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో జాన్ వెస్లీ పాల్గొంటారని తెలిపారు. సీతారాం ఏచూరి భారత కమ్యూనిస్టు పార్టీ (Communist Party of India) మార్క్సిస్టు నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలకు ఒక దిక్సూచిలా, మార్గదర్శిలా పనిచేశారన్నారు. దేశం కోసం, దేశ ప్రజలు, రైతాంగం, కార్మికుల కోసం, ప్రపంచ కార్పొరేట్ వ్యవస్థకు (global corporate system) వ్యతిరేకంగా సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలని నిర్మించిన వ్యక్తి అని కొనియాడారు.
భారత పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు (Best Parliamentarian Award) అందుకున్నారని, పార్లమెంటునుద్దేశించి ఏచూరి చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తుకు యువతరానికి మార్గదర్శిలాగా పనిచేస్తుందని తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని ఏచూరికి నివాళులర్పించడం అంటే ఆయన చూపించిన బాటలో ముందుకెళ్లడమేనని తెలిపారు.
19న జరిగే కార్యక్రమాన్ని జిల్లాలోని రైతులు, కార్మికులు, యువజనులు, ఏచూరి అభిమానులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు వెంకట్ గౌడ్, మోతీరాం నాయక్, కొత్త నర్సింలు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.