ePaper
More
    HomeతెలంగాణMLA Dhanpal Suryanarayana | దుర్గాదేవి ఆలయాభివృద్ధి అన్ని విధాలా సహకరిస్తాం: ఎమ్మెల్యే ధన్​పాల్​

    MLA Dhanpal Suryanarayana | దుర్గాదేవి ఆలయాభివృద్ధి అన్ని విధాలా సహకరిస్తాం: ఎమ్మెల్యే ధన్​పాల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA Dhanpal Suryanarayana | నగరంలోని గుమస్తా కాలనీలో గల దుర్గాదేవి ఆలయాభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) అన్నారు. ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధన్‌పాల్​తో పాటు నుడా ఛైర్మన్ కేశ వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, స్థానిక మాజీ కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్ హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుర్గాదేవి ఆలయ (Durga Devi temple) అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానన్నారు. ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు, తన ట్రస్ట్ ద్వారా మరో రూ. లక్ష ఆలయానికి అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆలయంలో నిత్యపూజా కార్యక్రమాలు (daily puja programs) కొనసాగించాలన్నారు. రాబోయే నవరాత్రులలో అమ్మవారి కార్యక్రమాలను బ్రహ్మాండంగా నిర్వహించాలన్నారు.

    అనంతరం నుడా ఛైర్మన్​ కేశ వేణు (Nuda Chairman Kesha Venu) మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి అవసరం ఉన్నా తన ప్రయత్నం చేస్తానన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వామి అవుతానని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (BJP District President Dinesh Kulachari) మాట్లాడుతూ ఇంత గొప్ప ఆలయం మన ఇందూరు నగరంలో ఉండడం అదృష్టమన్నారు. కొత్త కమిటీ సనాతన ధర్మ (Sanatana Dharma) పరిరక్షణలో భాగస్వాములై ఆలయాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

    మాజీ కార్పొరేటర్ ప్రవళిక శ్రీధర్ మాట్లాడుతూ ఈ ఆలయానికి బోర్ వేయించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

    నూతన కమిటీ అధ్యక్షుడు అమందు విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. తనకు బాధ్యత అప్పగించిన గుమస్తా సంఘ సభ్యులకు (Gumasta Sangha members) ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అభివృద్ధి విషయంలో అందరిని కలుపుకొని ముందుకు నడుస్తానని చెప్పారు.

    అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన కార్యదర్శిగా బాబురావు, కోశాధికారిగా ధాత్రిక వేణుగోపాల్, లవంగ సదాశివ, గౌరవాధ్యక్షులుగా మల్లేష్ యాదవ్, సందీప్, ఉపాధ్యక్షులుగా కిషన్, సంతోష్, అనిల్, కార్యదర్శులుగా అమందు వెంకటేష్, అమందు రాజేష్, కార్యవర్గ సభ్యులు దుబ్బయ్య, దానాజీ, ఉషాన్న, సంతోష్, శ్రీనివాస్, ప్రవీణ్, మైపాల్ రెడ్డి, హరీష్, గౌరవ సలహాదారులు రాజేందర్, భీమన్న తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...