ePaper
More
    HomeసినిమాCoolie Movie | బాక్సాఫీస్‌పై 'కూలీ' సునామీ కలెక్షన్స్.. 24 గంట‌ల్లో ఊహించ‌ని వసూళ్లు

    Coolie Movie | బాక్సాఫీస్‌పై ‘కూలీ’ సునామీ కలెక్షన్స్.. 24 గంట‌ల్లో ఊహించ‌ని వసూళ్లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Movie | సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) మళ్లీ తన మాస్ రేంజ్ ఏంటో చూపించారు. లోకేశ్ కనగ‌రాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’(Coolie Movie) థియేటర్లలో విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది.

    ప్రేక్షకుల నుండి భారీ స్పందన రావ‌డంతో మొదటి రోజు నుంచే సాలిడ్ స్టార్ట్ తీసుకున్న ఈ చిత్రం, రెండో రోజు కూడా అదే ఊపుతో దూసుకుపోతోంది. గత 24 గంటల్లోనే బుక్ మై షో వేదికగా 5,72,870 టికెట్లు బుక్ అయ్యాయి. ఇది నిజంగా మైండ్‌ బ్లోయింగ్ ఫిగర్‌గా చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అన్ని భాషల్లో ఈ సినిమాకు హౌస్‌ఫుల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్‌తో థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.

    Coolie Movie | స‌రికొత్త రికార్డు..

    ఈ సినిమాలో రజనీకాంత్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటే… టాలీవుడ్ కింగ్ నాగార్జున (Hero Nagarjuna) కీలక పాత్రలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి తోడు లోకేశ్ కనకరాజ్ స్టైల్, మాస్ ప్రెజెంటేషన్ సినిమాను మరింత ఎలివేట్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అభిమానులు “ఇది మాసివ్ కాదు.. సునామీ!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే అభిమానులు ‘కూలీ’ సినిమాకు ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ ట్యాగ్ కట్టేశారు. ఈ స్పీడు చూస్తుంటే రాబోయే వారంలో ‘కూలీ’ ? బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రాంపేజ్ చేస్తుందో ఊహించడానికి కష్టం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, తెలుగు సహా అన్ని భాషల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

    కూలీ సినిమా రివ్యూస్ కూడా పాజిటివ్ స్థాయిలో ఉండడంతో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాదిలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే రూ.151 కోట్లు వసూలు చేసినట్టు నిర్మాతలు ప్రకటించ‌డంతో ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. కోలీవుడ్ చరిత్రలో మొదటి రోజు 151 కోట్లు రావడం ఇదే మొదటి సారి అని నిర్మాతలు ప్ర‌క‌టించారు. గ‌తంలో ఈ రికార్డు విజయ్ సినిమా లియో పేరిట ఉండేది. లియో మొదటి రోజు కలెక్షన్లు 148 కోట్లు కాగా, దానిని కూలీ బ్రేక్ చేసింది. తమిళంలో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కాగా, లియో సినిమా కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించడం విశేషం.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this