ePaper
More
    HomeతెలంగాణNizamabad CP | విగ్రహాల ప్రతిష్టాపనకు నిబంధనలు తప్పకుండా పాటించాలి: సీపీ

    Nizamabad CP | విగ్రహాల ప్రతిష్టాపనకు నిబంధనలు తప్పకుండా పాటించాలి: సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | విగ్రహాల ప్రతిష్టాపనకు నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్టించరాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

    ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, ఐలాండ్ ప్రభుత్వ భవనాలు లాంటి చోట్ల ఎటువంటి విగ్రహాలను ఏర్పాటు చేయవద్దన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ (district collector) ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదన్నారు. ఇలా చేయడంవల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్న పిల్లలు మహిళలు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ స్థలంలో, కమర్షియల్ స్థలాల్లో రాత్రి సమయంలో 55 డెసిబెల్స్ సౌండ్ వాడాలని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేల సౌండ్ సిస్టం (DJ sound system) పూర్తిగా నిషేధమన్నారు.

    Nizamabad CP | ఊరేగింపులు, సభల నిర్వహణకు అనుమతులు తప్పనిసరి

    ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేటు (Nizamabad Commissionerate) పరిధిలో నిషేధమని పేర్కొన్నారు. ఎవరైనా సభలు, సమావేశాలు జన సంచార ప్రదేశాల్లో లౌడ్ స్వీకర్లు పెట్టాలని భావిస్తే సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. 500 మందితో కూడిన సమావేశాలు లేదా సభలు నిర్వహించాలని భావిస్తే సంబంధిత అసిస్టెంటు పోలీస్ కమిషనర్ అనుమతి తప్పనిసరని పేర్కొన్నారు. 500 మంది కంటే ఎక్కువ జనాలతో కూడిన కార్యక్రమానికి 72 గంటల ముందుగా పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని సూచించారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు.

    Nizamabad CP | డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు

    డ్రోన్ల వాడకం వల్ల ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో నియంత్రణ చర్యలు తీసుకోవడం జరగుతుందని సీపీ పేర్కొన్నారు. డ్రోన్ల ఉపయోగం వల్ల జనజీవనానికి విఘాతం కలగడమే కాకుండా శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎవరయినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రారంభించదలిస్తే ముందస్తుగా సంబంధిత ప్రభుత్వ సంస్థలు (government agencies), పోలీసు అధికారుల (police officers) నుంచి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.

    Nizamabad CP | నకిలీ గల్ఫ్ ఏజెంట్ల నుంచి అప్రమత్తంగా ఉండాలి

    జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లు (fake Gulf agents) ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మోసం చేస్తున్నారని సపీ పేర్కొన్నారు. పాస్​పోర్టు, వీసా రవాణా, టూరిస్ట్ తదితర సేవలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తూ.. అమాయక ప్రజలను మోసగిస్తున్నారన్నారు. జిల్లా ప్రజలు గల్ఫ్ ఏజెంట్లకు తమ ఇల్లు అద్దెకు ఇచ్చే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. అటువంటి వారు అద్దెకు వస్తే ముందస్తుగా వారి సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్​లో తెలియజేయాలని వివరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

    Nizamabad CP | బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధం

    బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని సీపీ తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్​ పరిధిలోని పోలీస్​ స్టేషన్లకు (police stations) పూర్తి అధికారాలు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.

    Latest articles

    Sriram Sagar | శ్రీరాంసాగర్​కు భారీ వరద.. 60 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

    అక్షరటుడే, ఆర్మూర్​ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్ (SRSP)​కు వరద పోటెత్తింది....

    Fish Samosa | టేస్టీ స్నాక్.. చేప సమోసా.. ఇలా చేస్తే లొట్టలేసుకుని లాగిస్తారు!

    అక్షరటుడే, హైదరాబాద్: Fish Samosa | సాధారణంగా మనం బంగాళాదుంప, ఉల్లిపాయల సమోసాలను తింటూ ఉంటాం. కానీ, మీరు...

    t20i series | స‌త్తా చావ‌లేదు.. ఓడే మ్యాచ్‌ని గెలిపించిన మ్యాక్స్‌వెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: t20i series : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ Maxwell వన్డే క్రికెట్‌కు వీడ్కోలు...

    Gold rates on august 17 | మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:  Gold rates on august 17 : భారతదేశంలో బంగారానికి Gold ఎప్పుడు డిమాండ్ ఉంటుంది....

    More like this

    Sriram Sagar | శ్రీరాంసాగర్​కు భారీ వరద.. 60 టీఎంసీలకు చేరిన నీటిమట్టం

    అక్షరటుడే, ఆర్మూర్​ : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​సాగర్ (SRSP)​కు వరద పోటెత్తింది....

    Fish Samosa | టేస్టీ స్నాక్.. చేప సమోసా.. ఇలా చేస్తే లొట్టలేసుకుని లాగిస్తారు!

    అక్షరటుడే, హైదరాబాద్: Fish Samosa | సాధారణంగా మనం బంగాళాదుంప, ఉల్లిపాయల సమోసాలను తింటూ ఉంటాం. కానీ, మీరు...

    t20i series | స‌త్తా చావ‌లేదు.. ఓడే మ్యాచ్‌ని గెలిపించిన మ్యాక్స్‌వెల్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: t20i series : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ Maxwell వన్డే క్రికెట్‌కు వీడ్కోలు...