ePaper
More
    HomeతెలంగాణHyderabad | 20 రోజులు రెక్కీ నిర్వహించి దోపిడీ.. ఖజానా జ్యువెలరీ కేసులో ఇద్దరు అరెస్ట్

    Hyderabad | 20 రోజులు రెక్కీ నిర్వహించి దోపిడీ.. ఖజానా జ్యువెలరీ కేసులో ఇద్దరు అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​ నగరంలోని చందానగర్​లో గల ఖజానా జ్యువెలరీలో (Khajana Jewellery) ఇటీవల దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఆరుగురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి తుపాకులతో బెదిరించి దోపిడీ చేశారు. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం మాదాపూర్​ డీసీపీ వినీత్​ కుమార్ (Madhapur DCP Vineeth Kumar) తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

    Hyderabad | బీహార్​కు చెందిన ముఠా

    బీహార్​కు చెందిన ముఠా ఈ దోపిడీ చేసినట్లు డీసీపీ తెలిపారు. మొత్తం ఏడుగురు నిందితులు ఇందులో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. అందులో ఇద్దరు నిందితులు ఆశిష్ కుమార్ సింగ్ (22), దీపక్ కుమార్ సాహూ (22) షాను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితులు బిహార్‌ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ (Bihar Most Wanted Criminals) అని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరిపై 10 కేసులు ఉన్నాయన్నారు. వారు 20 రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad)​కు వచ్చారన్నారు. సెకండ్​ హ్యాండ్​లో బైక్​లు కొనుగోలు చేశారు. పోలీసుల నిఘా ఎక్కువగా లేని చందానగర్ (Chanda Nagar)​ ఖజానా జ్యువెల్లరీ చోరీ చేయాలని ప్లాన్​ వేశారు. 20 రోజుల పాటు రెక్కి నిర్వహించారు. అనంతరం ఆగస్టు 12న తుపాకులతో నగల దుకాణంలోకి చొరబడ్డారు.

    Hyderabad | ఇతర రాష్ట్రాల్లోనూ దోపిడీ

    దోపిడీకి పాల్పడిన నిందితుడు ఆశిష్​కుమర్​ను మహారాష్ట్ర(Maharashtra)లో అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో నిందితుడు దీపక్​కుమార్​ను సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి నాటు తుపాకులు, బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో దొంగలు పరారు కాగా.. 900 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కోల్‌కతా, బిహార్‌, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this