అక్షరటుడే, వెబ్డెస్క్ : Police | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో పోలీసు hyderabad city police వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అదనంగా స్టేషన్ల new police stations మంజూరుతో పాటు సిబ్బందిని కేటాయించింది.
హైదరాబాద్ నగరంలో కొత్తగా రెండు జోన్లను ఏర్పాటు చేశారు. అలాగే 11 లా అండ్ ఆర్డర్ ఠాణాలు, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 7 మహిళా ఠాణాలు ఏర్పాటు చేస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ cp CV anand ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్లకు ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లను కేటాయించారు. ఈ క్రమంలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేశారు.
హైదరాబాద్ సిటీ ప్రజలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టారు.