ePaper
More
    HomeసినిమాRajinikanth | ర‌జ‌నీకాంత్‌కు త‌మిళంలో విషెస్ చెప్పిన మోదీ.. చంద్ర‌బాబు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు

    Rajinikanth | ర‌జ‌నీకాంత్‌కు త‌మిళంలో విషెస్ చెప్పిన మోదీ.. చంద్ర‌బాబు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajinikanth | ఒక నటుడు తన స్టైల్‌తో, శ్రమతో, నిబద్ధతతో ఐదు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పూర్తిచేయడం నిజంగా అరుదైన ఘనత. అలాంటి ఘనత రజనీకాంత్ సొంతం చేసుకున్నారు. 1975లో విడుదలైన ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajini Kanth), ఇప్పుడు 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా మార్చిన విషయం ఏమిటంటే, ఆగస్టు 14న విడుదలైన రజినీకాంత్ కొత్త చిత్రం ‘కూలీ’ (Coolie Movie) విడుదల రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 151 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి తమిళ సినిమా చరిత్రలో ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్ రికార్డ్‌ను బద్దలుకొట్టింది.

    Rajinikanth | 50 ఏళ్ల జ‌ర్నీ..

    ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures) అధికారికంగా ప్రకటించింది. సూపర్ స్టార్ ర్యాంపేజ్‌కు ఇదొక నిదర్శనం మాత్రమే. బస్ కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన రజినీకాంత్‌కి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉండటం గొప్ప విషయం. ఆయన నడక ఓ స్టైల్, కాల్ ఎగరేయడం ఓ స్టైల్, సిగరెట్ తిప్పడం ఓ స్టైల్.. ఇలా ఏది చేసినా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త సంపాదించుక‌న్నారు. కర్ణాటకలో జన్మించి, తమిళ ప్రజల మనసులు గెలుచుకుని, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ అశేష అభిమాన‌గణం ఏర్ప‌రచుకున్నాడు రజనీ. జపాన్, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లోనూ కల్ట్ ఫాలోయింగ్ కలిగిన అరుదైన భారతీయ నటుడిగా ర‌జనీకాంత్‌ నిలిచారు.

    ఈ ప్రత్యేక ఘట్టాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) కూడా రజినీకాంత్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. “సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజినీకాంత్‌కు శుభాకాంక్షలు. ఆయన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుతున్నాను” అని మోదీ తమిళం, ఇంగ్లీష్‌లో ట్వీట్ చేయడం విశేషం. అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కూడా రజినీకాంత్​కు ప్ర‌త్యేక‌ అభినందనలు తెలిపారు. రజినీకాంత్ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు చంద్రబాబు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this