అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కుక్కను (dog) తప్పించబోయి డివైడర్ను కారు ఢీకొన్న ఘటన భిక్కనూరు మండలం (bhikanoor) బీటీఎస్ చౌరస్తా వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందిన రాజశేఖర్ బతుకు దెరువు నిమిత్తం ఖతర్ వెళ్లాడు. తిరిగి స్వదేశానికి వస్తున్న రాజశేఖర్ ను తీసుకురావడానికి అతని బంధువులు శుక్రవారం రాత్రి కారులో ఎయిర్ పోర్టుకు వెళ్లారు.
శనివారం తెల్లవారుజామున ఎయిర్ పోర్టు (Air Port) నుంచి బయలుదేరి భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయిన డ్రైవర్ కారును డివైడర్ ను ఢీకొట్టాడు. వేగంగా వస్తున్న కార్డు డివైడర్ ను ఢీకొట్టడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ సహా అతని బంధువులు ఆర్మూర్ మండలం (Armoor Mandal) పిప్రి గ్రామానికి చెందిన లక్ష్మీ, సాయికుమార్, ఆర్మూర్ రాంనగర్ కు చెందిన సాయికుమార్, బడా భీంగల్ కు చెందిన మహిపాల్ (కారు డ్రైవర్) లకు గాయాలయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు