అక్షరటుడే, గాంధారి: Gandhari | భారీ వర్షాలు కురుస్తుండడంతో కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని (Gandhari mandal) జువ్వడి గ్రామంలో పెంకుటిల్లు కూలింది. గ్రామానికి చెందిన చాకలి సంగవ్వ ఇల్లు శనివారం ఉదయం కూలిపోయింది. ఇల్లు కూలిన (house collapse) సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు. భారీ వర్షాలు (heavy rains) నేపథ్యంలో పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. సుమారు రూ. రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిలినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
Gandhari ఆ ఇంట్లో నివాసం ఉండట్లేదు: తహశీల్దార్
భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో కూలిన పెంకుంటింట్లో ఎవరూ నివాసం ఉండట్లేదని తహశీల్దార్ రేణుక చవాన్ (Tahsildar Renuka Chavan) తెలిపారు. వర్షాల కారణంగా ఇల్లు కూలిపోయిందని పేర్కొన్నారు. కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో ప్రజలు నివాసం ఉండవద్దని ఆమె సూచించారు.