అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai Police Station | ఇందల్వాయి పోలీస్ స్టేషన్ వద్ద గిరిజనుల ఆందోళన దిగారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులను (tribal leaders) శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని ఇందల్వాయి పోలీస్ స్టేషన్కు (Indalwai Police Station) తరలించారు.
దీంతో వారి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని అన్ని తండాల గిరిజనులు పోలీస్ స్టేషన్కు తరలివచ్చారు. స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ నాయకులను వదిలిపెట్టేంతవరకు స్టేషన్ వద్దే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkat Reddy) ఇందల్వాయి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గిరిజనులతో మాట్లాడి వారిని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.