ePaper
More
    HomeజాతీయంBihar CM | బీహార్ సీఎం నితీశ్ మ‌రో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు...

    Bihar CM | బీహార్ సీఎం నితీశ్ మ‌రో ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న‌.. ఐదేళ్ల‌లో కోటి ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bihar CM | బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల(Bihar Assembly Elections) నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ ఓట‌ర్ల‌పై వ‌రుస‌గా వ‌రాల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప‌థ‌కాలు ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. తాజాగా మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం(State Government) యువతకు 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తుందని వెల్ల‌డించారు. 2020లో సాత్ నిశ్చయ్-2 కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాన్ని కొంత చేరుకున్నామ‌న్నారు. ఇప్పటికే 50 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉపాధి మార్గాల ద్వారా త‌మ ప్రభుత్వం ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వం కొత్త వ్యాపారాలకు ప్రోత్సాహకాలను అందిస్తుందని, బీహార్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యవస్థాపకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని అందిస్తుందని శ‌నివారం సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

    Bihar CM | ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊతం..

    రాష్ట్రంలోని యువ‌తకు ఉపాధి క‌ల్పించేందుకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని నితీశ్(Bihar CM Nitish) తెలిపారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో కోటి మందికి ఉపాధి క‌ల్పిస్తామ‌న్నారు. “2020లో సాత్ నిశ్చయ్-2 ప‌థ‌కం కింద మా ప్రభుత్వం 50 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యాన్ని నెరవేర్చింది. ఇప్పుడు, రాబోయే 5 సంవత్సరాలలో 1 కోటి మంది యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారినిచ‌ స్వయం ఉపాధిని అనుసరించేవారికి వివిధ సౌకర్యాలను అందించడం ద్వారా ప్రోత్సహం క‌ల్పిస్తాం. బీహార్‌లో పరిశ్రమలను స్థాపించే వ్యవస్థాపకులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టిస్తామ‌ని” అని నితీశ్ Xలో వెల్ల‌డించారు.

    Bihar CM | ప్రోత్సాహ‌కాలు రెట్టింపు..

    ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌చ్చే వారికి ప్రోత్సాహకాలు రెట్టింపు చేస్తామ‌ని నితీశ్ వెల్ల‌డించారు. మూలధన సబ్సిడీ, వడ్డీ సబ్సిడీ, GST రీయింబర్స్‌మెంట్ కోసం అందించిన మొత్తాన్ని రెట్టింపు చేస్తామ‌న్నారు. అలాగే, పరిశ్రమల స్థాపన కోసం ప్రతి జిల్లాలో భూమిని కేటాయిస్తామ‌న్నారు. ఎక్కువ ఉపాధిని కల్పించే పరిశ్రమలకు ఉచితంగా భూమి ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. పరిశ్రమల కోసం కేటాయించిన భూములకు సంబంధించిన ఏవైనా వివాదాలు వెంటనే పరిష్కరిస్తామ‌న్నారు. బీహార్‌లో పరిశ్రమలు(Industries), ఉపాధి అవకాశాలను(Employment Opportunities) పెంచడానికి మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని, ఈ విషయంలో త్వరలో వివరణాత్మక నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్ర‌క‌టించారు.

    Latest articles

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    More like this

    Professor Limbadri | తెలంగాణ ఉన్నత విద్య మండలి మాజీ ఛైర్మన్ లింబాద్రికి మాతృవియోగం

    అక్షరటుడే, నిజామాబాద్ : Professor Limbadri : తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ రిక్క...

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...