ePaper
More
    HomeతెలంగాణToll Pass | తెలంగాణలో అమలులోకి రాని టోల్​పాస్​.. ఎందుకో తెలుసా?

    Toll Pass | తెలంగాణలో అమలులోకి రాని టోల్​పాస్​.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Pass | జాతీయ రహదారులపై (National Highways) ఉన్న టోల్ గేట్ల వద్ద వాహనదారులు యేటా వేలాది రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారు. ఎక్కువ రాకపోకలు సాగించే వారు టోల్​ ఛార్జీలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు మేలు చేసేలా వార్షిక టోల్​ పాస్ (Annual Toll Pass)​ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

    రూ.మూడు వేలు పెట్టి పాస్​ తీసుకుంటే టోల్​ గేట్ల నుంచి 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ పాస్​తో వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా టోల్​పాస్​ విధానం అమలులోకి వచ్చింది. కానీ తెలంగాణలో (Telangana) మాత్రం రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన్​ పోర్టల్​లో (Vahan Portal) తెలంగాణ వాహనాల వివరాలు నమోదు కాకపోవడమే ఇందుకు కారణం.

    Toll Pass | ఆందోళనలో వాహనదారులు

    వార్షిక టోల్​పాస్​తో వాహనదారులకు ఎంతో మేలు. నాన్​ కమర్షియల్​ వాహనాలకు రూ.మూడు వేలతో 200 సార్లు టోల్​ గేట్ల మీదుగా వెళ్లేందుకు కేంద్రం ఈ పాస్​ తీసుకొచ్చింది. అంటే ఒక్కొ టోల్​గేట్​ (Tollgate) వద్ద సగటున రూ.15 మాత్రమే కట్​ అవుతాయి. ప్రస్తుతం వాహనదారులు రూ.100 వరకు టోల్​ ఛార్జీలు చెల్లిస్తున్నారు. కొత్త విధానంతో తమకు మేలు జరుగుతుందని వాహనదారులు ఆశ పడ్డారు. పాస్​లు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ రాష్ట్రంలో ఈ విధానం ఇంకా అమలులోకి రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ వాహనాల వివరాలను పోర్టల్​లో నమోదు చేసి టోల్​ పాస్​ అందుబాటులోకి తీసుకు రావాలని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాసినట్లు సమాచారం.

    Toll Pass | సాంకేతిక కారణాలతో..

    కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాహన్ డేటాబేస్ పని చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజినల్ ట్రాన్స్​పోర్ట్ ఆఫీసుల (ఆర్టీవో) నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు ఒకే వ్యవస్థలోకి తీసుకురావడం దీని లక్ష్యం. వాహన యజమాని పేరు, రిజిస్ట్రేషన్, వెహికల్​ వివరాలు డేటాబేస్​లో ఉంటాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ వాహనాల సమాచారాన్ని డేటాబేస్‌‌‌‌తో అనుసంధానించాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం సాంకేతిక కారణాలతో వాహన వివరాలు నమోదు చేయలేదు. దీంతో తాజాగా వార్షిక టోల్​ పాస్​ విధానం రాష్ట్రంలో అమలులోకి రాకుండాపోయింది. ప్రభుత్వం వివరాలు అప్​డేట్​ చేసిన అనంతరం టోల్​ పాస్​ విధానం రాష్ట్రంలో కూడా అమలులోకి రానుంది.

    Latest articles

    Coolie Movie | బాక్సాఫీస్‌పై ‘కూలీ’ సునామీ కలెక్షన్స్.. 24 గంట‌ల్లో ఊహించ‌ని క‌లెక్షన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Movie | సూపర్‌స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) మళ్లీ తన మాస్ రేంజ్...

    Indalwai Mandal | వర్షంలో జారిపడి వ్యక్తి మృతి

    అక్షర టుడే, ఇందల్వాయి : Indalwai Mandal | మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి(Sirnapalli Village) చెందిన పురేందర్ గౌడ్...

    Kaleshwaram Project | కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారు.. ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kaleshwaram Project | బీఆర్​ఎస్​ (BRS) హయాంలో​ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్​ను...

    Banswada MLA | సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada MLA | సీఎం సహాయ నిధి చెక్కులను బాన్సువాడలో శనివారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,...

    More like this