ePaper
More
    Homeబిజినెస్​IPO | ఐపీవోకు శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌ కంపెనీ.. 19 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    IPO | ఐపీవోకు శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌ కంపెనీ.. 19 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి మరో ఐపీవో (IPO) వస్తోంది. శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌ కంపెనీ (Shreeji Shipping Global) సబ్‌స్క్రిప్షన్‌ ఈనెల 19న ప్రారంభం కానుంది. కంపెనీ షేర్లు గ్రేమార్కెట్‌లో పది శాతం ప్రీమియంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

    శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌ కంపెనీని 1995లో స్థాపించారు. ఇది మన దేశంతోపాటు శ్రీలంక (Srilanka) అంతటా ఓడరేవులు, జెట్టీలలో డ్రై బల్క్‌ కార్గో (Dry Bulk Cargo) కోసం పూర్తి షిప్పింగ్‌, లాజిస్టిక్స్‌ సేవను (Complete shipping and logistics services) అందిస్తుంది. బార్జ్‌లు, మినీ బల్క్‌ క్యారియర్లు, టగ్‌బోట్‌లు, తేలియాడే క్రేన్‌లు వంటి 80కి పైగా ఓడల సముదాయాన్ని నిర్వహిస్తుంది. ఈ కంపెనీ లైటరింగ్‌, స్టీవ్‌డోరింగ్‌, కార్గో నిర్వహణ, కార్గో హ్యాండ్లింగ్‌ సేవలతో సహా అనేక రకాల సేవలను అందిస్తోంది. స్క్రాప్‌ (Scrap) అమ్మకం, వివిధ చిన్న కార్యకలాపాలు చేయడం ద్వారా ఇతర ఆదాయాలు ఆర్జిస్తోంది. ఏటా 14 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గోను నిర్వహిస్తున్నట్లు ఈ కంపెనీ పేర్కొంటోంది. రూ. 410.71 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవోకు వస్తోంది. ఫ్రెష్‌ ఇష్యూ (Fresh issue) ద్వారా ఈ నిధులను సమీకరించనున్నారు.

    IPO | ఆర్థిక పరిస్థితి..

    2024లో రూ. 736.17 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం (Revenue).. 2025లో రూ. 610.45 కోట్లకు చేరింది. నికర లాభం (Net profit) రూ. 124.51 కోట్లనుంచి రూ. 141.24 కోట్లకు పెరిగింది. ఆస్తులు (Assets) రూ. 610.65 కోట్లనుంచి రూ. 758.58 కోట్లకు చేరాయి.

    ముఖ్యమైన తేదీలు..

    ఈనెల 19న ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) ప్రారంభమవుతుంది. 21 వరకు కొనసాగుతుంది. 22న రాత్రి షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు ఈనెల 26న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ అవుతాయి.

    ధరల శ్రేణి..

    కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను 240 నుంచి రూ.252 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 58 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద రూ. 14,616 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    కోటా, జీఎంపీ..

    క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. ఈ కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్‌(Grey market)లో డిమాండ్‌ ఉంది. ఒక్కో ఈక్విటీ షేరు రూ. 26 ప్రీమియంతో ట్రేడ్‌ అవుతోంది. అంటే లిస్టింగ్‌ రోజు 10 శాతం వరకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    Latest articles

    film industry bandh issue | చిరంజీవి చెంతకు సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: film industry bandh issue : సినీ పరిశ్రమ బంద్‌ వ్యవహారం చిరంజీవి దగ్గరకు చేరింది....

    RGV criticizes dog lovers | డాగ్ లవర్స్ పై ఆర్జీవీ విమర్శనాస్త్రాలు.. దుమ్ము దులిపేశాడు..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: RGV criticizes dog lovers : భారత్​ క్యాపిటల్​ సిటీ ఢిల్లీతోపాటు దాని సమీప ప్రాంతాల్లో...

    CMC Medical College | సీఎంసీ మెడికల్ కళాశాల పున ప్రారంభిస్తాం: మెడికల్ బోర్డు కన్వీనర్ దయానంద్

    అక్షరటుడే, ఇందూరు: CMC Medical College : నిజామాబాద్​ (NIZAMABAD) జిల్లా డిచ్​పల్లి శివారులోని సీఎంసీ మెడికల్ కళాశాల(CMC...

    Nizamabad private hospital | ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడి మృతి.. ఆస్పత్రి ఎదుట సీఐటీయూ ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad private hospital | నిజామాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స...

    More like this