ePaper
More
    Homeబిజినెస్​Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. ఇది మ‌హిళ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది.

    భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వ‌ల‌న‌ పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ఇటీవ‌ల బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గ‌రిష్టానికి వెళ్లింది. అయితే ఇప్పుడు కాస్త త‌గ్గుతూ ఉండ‌టం శుభ‌ప‌రిణామం అని చెప్పాలి.

    ఆగస్టు 16న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,230గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.92,790కి చేరింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర Gold Price వంద రూపాయల మేర తగ్గింద‌ని అర్ధ‌మవుతోంది.

    Gold Rates : త‌గ్గుతున్న ధ‌ర‌లు..

    దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

    • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,01,230గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,790గా ట్రేడ్ అయింది. ఇక కిలో వెండి ధర రూ.1,26,200 గా న‌మోదైంది.
    • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.92,790 లుగా న‌మోదైంది. వెండి కిలో ధర రూ.1,26,200గా ట్రేడ్ అయింది.
    • ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,380గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.92,940 లుగాన‌మోదైంది. ఇక ఇక్క‌డ‌ కిలో వెండి ధర Silver Price రూ.1,16,200 గా ఉంది.
    • ముంబైలో Mumbai 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.93,790గా న‌మోదైంది. అలానే వెండి ధర కిలో రూ.1,16,200గా ఉంది.
    • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా.. 22 క్యారెట్ల ధర రూ.92,790 గా న‌మోదైంది. ఇక వెండి ధర కిలో రూ.1,26,200గా ట్రేడ్ అయింది.
    • బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల ధర రూ.92,790 గా న‌మోదైంది. వెండి ధర కిలో రూ.1,16,200గా ఉంది.

    వెండి కిలో ధర నిన్న‌టి కంటే రూ.100 పెరిగింది. ఇక ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది అన్న విష‌యాన్ని గ‌మ‌నించాలి.

    Latest articles

    Rahul Gandhi | బీహార్​లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్​ అడుగులు​.. ఓటర్​ అధికార్​ యాత్ర చేపట్టనున్న రాహుల్​ గాంధీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | బీహార్​లో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) జరగనున్నాయి....

    Krishnashtami | ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

    అక్షరటుడే, ఇందూరు/కామారెడ్డి: Krishnashtami | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే...

    Medical Health Director | వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ హెల్త్ డైరెక్టర్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medical Health Director | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు...

    Heavy Rains | భారీ వర్షాలతో పలుచోట్ల కూలిన ఇళ్లు, ప్రహరీలు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains | ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి...

    More like this