అక్షరటుడే, వెబ్‌డెస్క్: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్ ఆల్కహాల్ (international brand alcohol) కోసం ఎగబడే మద్యం ప్రియులకు టేకీలా అనే పేరు తెలిసే ఉంటుంది. కానీ దీని గురించి అడిగితే మాత్రం బహుశా ఎవరూ చెప్పలేరు.
ఈ టేకీలా(Tequila) మద్యం నార్త్ అమెరికా(North America)లోని మెక్సికో(Mexico)లో చాలా ప్రాచుర్యంలో ఉంది. దీని కోసం అక్కడివారు ఎగబడతారు. ఈ మద్యం ప్రియులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
1918 స్పానిష్ ఫ్లూ (Spanish flu) విజృంభించిన సమయంలో జనాలను టేకీలా తాగమని స్వయంగా వైద్యులే సలహా ఇచ్చారట. టేకిలాకు ఉప్పు, నిమ్మకాయను జత చేసి తీసుకుంటే ఫ్లూ తగ్గిపోతుందని అప్పట్లో తెగ ప్రచారం చేశారు.
alcohol with volcanic ash : ఏమిటీ టేకీలా..
టేకీలా(Tequila) అనేది ఒక మద్యం. దీనిని నీలి కిత్తలి మొక్క నుంచి తయారు చేస్తారు. ఇది స్వేదన పానీయం. కిత్తలి అనేది లిల్లీ జాతికి చెందిన మొక్కగా పేర్కొంటారు. ఈ మొక్క పెద్ద కలబందలా ఉంటుంది. కిత్తలి చివరన పదునైన ముళ్లు ఉండటం గమనార్హం. సురా పానం మాదిరి ఈ పానీయం శతాబ్దాలుగా ప్రాచుర్యంలో కొనసాగుతోంది.
alcohol with volcanic ash : మొదట ఎప్పుడు తయారు చేశారంటే..
టేకీలా(Tequila) ప్రొడక్షన్ 16వ శతాబ్దంలో మొదట జాలిస్కో రాష్ట్రంలోని టేకీ సిటీలో ప్రారంభమైంది. మొదటి టేకీలా డిస్టిలరీని అల్టమిరా వాసి మార్క్విస్ పరిచయం చేశారు. టేకీలాను ప్రారొంభంలో బ్లూ వెబర్ అగావ్ (అగావ్ అజుల్) అని పేర్కొనే కిత్తలి నుంచి ప్రొడక్ట్ చేశారు. ఈ జాతి కిత్తలినే ఇప్పటికీ టేకిలా తయారీలో వినియోగిస్తారు. బ్లూ వెబర్ అగావేను సైతం టెకీలా మద్యం ప్రొడక్షన్లో వాడతారు. ఈ జాతి మొక్కలు మెక్సికోలోని జాలిస్కోలో ఉన్న కొండ ప్రదేశాల్లో పెరుగుతాయి.
జాలిస్కో(Jalisco)లో ఉన్న ఎత్తైన ప్రాంతాల భూమి నీలి అగావేను పెంచడానికి అనువుగా ఉంటుంది. ఎందుకుంటే సిలికేట్ అధికంగా ఉండే ఎర్రటి అగ్నిపర్వత భూమిలో మాత్రమే నీలి అగావే పెరుగుతుంది. అందుకే అగ్నిపర్వత బూడిదను టెకీలా ప్రొడక్ట్ లో వినియోగిస్తారు.
కేవలం టేకీలా ఉత్పత్తి కోసమే ఏటా 300 మిలియన్లకు పైగా కిత్తలి మొక్కలను పెంచుతారు. ఇక నీలి కిత్తలి blue agave పరిపక్వం చెందడానికి సుమారు ఎనిమిది నుంచి పదేళ్లు పడుతుందట.
కిత్తలి agave పెరిగిన కొద్దీ దాని వేర్ల వద్ద అంటే భూమి లోపల ‘పినా’pina’ అనే అతి పెద్ద గడ్డ దినుసు పెరుగుతుంది. ఈ గడ్డ పెద్ద తమలపాకులా betel leaf ఉంటుంది. ఆకులు కోశాక పినాను ఉత్పత్తి చేస్తారు. పంట కోశాక పినాను డిస్టిలరీకి పంపిస్తారు. అక్కడ ఉడికించి పులియబెడతారు. ఇంకేం ఆ తర్వాత మద్యం తయారీ ప్రాసెస్ మొదలవుతుంది.