అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagaland Governor | నాగాలాండ్ గవర్నర్ గణేషన్ (80) శుక్రవారం మృతి చెందారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital)లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 2023 ఫిబ్రవరి 20న నాగాలాండ్ (Nagaland) 19వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 2021 నుంచి 2023 వరకు మణిపూర్, పశ్చిమ బెంగాల్ గవర్నర్ (అదనపు)గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల ఆయన తన ఇంట్లో కింద పడటంతో తలకు గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మరణించారు.
గణేశన్ 1945 ఫిబ్రవరి 16న బ్రాహ్మణ కుటుంబంలో ఇలక్కుమిరకవన్, అలమేలు దంపతులకు జన్మించారు. ఆయన తమిళనాడు బీజేపీ (Tamilnadu Bjp)కి చెందిన సీనియర్ నాయకుడు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది. నాగాలాండ్ గవర్నర్‌గా 2023 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు మణిపూర్ (Manipur) గవర్నర్‌గా కూడా పని చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సైతం పని చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతానికి కృషి చేసిన ఆయనకు పార్టీ గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించింది. ఆయన మృతిపై పలువురు సంతాపం తెలిపారు.