అక్షరటుడే, కామారెడ్డి: Dog Bite | రాజంపేట మండల (Rajampet mandal) కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి ధనుంజయ్ (4) మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో అటుగా వచ్చినటువంటి వీధి కుక్కలు (stray dogs) ఒకసారిగా బాలుడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు.
విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది కుక్కలను తరిమే ప్రయత్నం చేయగా ఉపాధ్యాయురాలిపై సైతం దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి (Kamareddy District Hospital) తరలించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స కొనసాగుతోంది.
Dog Bite | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) పలు కాలనీలలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పలు కాలనీల్లో పలువురిపై దాడికి పాల్పడింది. పిచ్చికుక్క దాడిలో దాదాపు 20 మందికి గాయలైనట్టుగా తెలుస్తోంది. గాయపడిన వారు జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం పరుగులు తీశారు.