అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vikram Solar IPO | దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో ఐపీవో వస్తోంది. విక్రమ్ సోలార్ కంపెనీ ఐపీవో సబ్స్క్రిప్షన్(Subscription) 19 నుంచి ప్రారంభం కానుంది. దీనికి గ్రే మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
మెయిన్ బోర్డ్ కేటగిరీకి చెందిన విక్రమ్ సోలార్ కంపెనీని 2005లో స్థాపించారు. ఇది ఫొటో ఓల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ తయారీ వ్యాపారంలో ఉంది. దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ తన ఉత్పత్తులను విక్రయిస్తుంది. సోలార్ పవర్ ప్రాజెక్టుల(Solar power projects) నిర్మాణం, ఇంజినీరింగ్ సేవలను కూడా అందిస్తోంది. అలాగే ప్రాజెక్టుల నిర్వహణను కూడా చూసుకుంటుంది.
రూ. 2,079 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఈ కంపెనీ ఐపీవో(IPO)కు వస్తోంది. ఇందులో రూ.1500 కోట్లు ఫ్రెష్ ఇష్యూ కాగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ రూపంలో సమీకరించనున్నారు.
ఐపీవో తేదీలు : ఐపీవో ఈనెల 19 న ప్రారంభమవుతుంది. 21 వరకు కొనసాగుతుంది. 22న రాత్రి షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ వెల్లడయ్యే అవకాశాలున్నాయి. కంపెనీ షేర్లు 26న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్ కానున్నాయి.
ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ప్రైస్‌బాండ్(Price band)ను ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.315 నుంచి రూ.332గా నిర్ణయించింది. లాట్ పరిమాణాన్ని 45 షేర్లుగా పేర్కొంది. ఈ ఐపీవోకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు గరిష్ట ప్రైస్‌బాండ్ వద్ద ఒక లాట్ కోసం రూ.14,940 వెచ్చించాల్సి ఉంటుంది.
కోటా, జీఎంపీ : క్యూఐబీ(QIB)లకు 50 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను కేటాయించారు. కంపెనీ షేర్లకు ప్రస్తుతం గ్రేమార్కెట్‌లో మంచి స్పందన ఉంది. ప్రస్తుతం ఒక్కో షేరుపై రూ. 57 ప్రీమియం లభిస్తోంది. అంటే లిస్టింగ్ రోజు 17 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.