అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Redmi 15 | చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ అయిన రెడ్‌మీ (Redmi).. మిడ్ రేంజ్‌లో భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఫోన్‌ను తీసుకువస్తోంది. దీనిని ఈనెల 19న లాంచ్ చేయనుంది. రెడ్‌మీ 15(Redmi 15) పేరుతో తీసుకువస్తున్న ఈ మోడల్.. అమెజాన్‌తోపాటు రెడ్‌మీ ఈస్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలోనూ అందుబాటులో ఉండనుంది. పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించకపోయినా.. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ (Specifications) ఇలా ఉండే అవకాశాలున్నాయి.
డిస్‌ప్లే : 6.9 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, TUV Rheinland సర్టిఫికేషన్స్ 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. భారీ బ్యాటరీ కేటగిరిలో ఇదే లార్జెస్ట్ డిస్‌ప్లే కలిగిన ఫోన్ అని కంపెనీ పేర్కొంటోంది.
సాఫ్ట్‌వేర్ : షావోమి హైపర్ ఓఎస్2 తో పనిచేస్తుంది. నాలుగేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వనుంది.
స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్ ఉంది.
బ్యాటరీ : సిలికాన్ కార్బన్ టెక్నాలజీతో రూపొందించిన 7000 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 33 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్‌ను, 18 డబ్ల్యూ రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. నాలుగేళ్ల తర్వాత కూడా 80 శాతం సామర్థ్యంలో పనిచేస్తుందని కంపెనీ పేర్కొంటోంది. భారీ బ్యాటరీ సెగ్మెంట్‌లో ఇదే స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెబుతోంది. బ్యాటరీలో ఒక్క శాతమే చార్జింగ్ ఉన్నా.. స్టాండ్‌బై మోడ్‌లో 7.5 గంటలపాటు ఉంటుందని, 59 నిమిషాల పాటు కాల్స్ మాట్లాడవచ్చని పేర్కొంది.
కెమెరా సెటప్ : వెనకవైపు 50 ఎంపీ డ్యుయల్ ఏఐ సెన్సార్లు, 2 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్పీల కోసం 8 ఎంపీ సెన్సార్ అమర్చారు.
వేరియంట్స్ : మూడు రంగుల్లో లభించనుంది. రిపుల్ గ్రీన్, టైటాన్ గ్రే, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో తీసుకువస్తున్నారు.
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌తోపాటు 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌లలో ఈ ఫోన్ లభించే అవకాశాలున్నాయి. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్ ధర రూ. 20 వేలలోపు ఉండనుంది. ఐసీఐసీఐ అమెజాన్ పే క్రెడిట్ కార్డ్‌లో కొనుగోలు చేసేవారికి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలున్నాయి.