ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో ఐబీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..

    Intelligence Bureau Jobs | పదో తరగతి అర్హతతో ఐబీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Intelligence Bureau Jobs | కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(IB)లో సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి(SSC) అర్హతతో 4,987 పోస్టులను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 37 అనుబంధ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్‌ఐబీ)ల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

    పోస్టుల సంఖ్య: 4,987(అన్‌ రిజర్వ్‌డ్‌ -2,471, ఓబీసీ -1,015, ఎస్సీ -574, ఎస్టీ -426, ఈడబ్ల్యూఎస్‌ -501).
    పోస్టుల వివరాలు: సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌(ఇవి జనరల్‌ సెంట్రల్‌ సర్వీస్‌, గ్రూప్‌ -సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టులు).

    అర్హతలు:

    గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన నివాస ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సంబంధిత రాష్ట్రం/ఎస్‌ఐబీ ప్రాంత భాషలో మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఇంటెలిజెన్స్‌(Intelligence) క్షేత్రంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైనవారు దేశంలో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి.

    వయోపరిమితి : 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయసవారు అర్హులు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ(OBC)లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

    వేతన శ్రేణి : లెవెల్‌ -3లో నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వేతన శ్రేణి అందుతుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు అదనం.

    ఎంపిక ప్రక్రియ :

    టైర్‌-1లో వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌(Objective) తరహాలో ఆన్‌లైన్‌ టెస్టు ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి 50 మార్కులకు టైర్‌ -2 డిస్క్రిప్టివ్‌ టెస్టు, తర్వాత టైర్‌-3లో 50 మార్కులకు ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్టు నిర్వహిస్తారు. టైర్‌-1లో వంద మార్కులకు, టైర్‌-3 లో 50 మార్కులకు అభ్యర్థులు సాధించిన సంయుక్త స్కోర్‌ ఆధారంగా తుది మెరిట్‌ లిస్ట్‌(Merit list)ను రూపొందిస్తారు. ఈ మెరిట్‌ లిస్ట్‌లో నిలిచిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అర్హులను ఖరారు చేస్తారు.

    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తులకు చివరి తేది : ఈనెల 17
    దరఖాస్తు రుసుము : జనరల్‌(General), ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ. 650 ఫీజు చెల్లించాలి.
    ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ఎస్‌ఎం అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు రూ. 550 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

    దరఖాస్తు విధానం..

    దరఖాస్తు, పూర్తి వివరాలకు http://www.mha.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.
    ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్‌ – 2025 అప్లై ఆన్‌లైన్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
    ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకోవాలి.
    దరఖాస్తును పూరించి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ బటన్‌ నొక్కాలి. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.

    Latest articles

    Medak | యథేచ్ఛగా మొరం దందా.. అడ్డుకున్న గ్రామస్తులు

    అక్షరటుడే, మెదక్​ : Medak | మొరం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు (Permissions) తీసుకోకుండా అక్రమంగా మొరం...

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...

    Mahammad nagar | పంద్రాగస్టు రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Mahammad nagar | స్వాతంత్య్ర దినోత్సవం రోజు యథేచ్ఛగా మద్యం విక్రయాలు కొనసాగాయి. ఎక్సైజ్​శాఖ (Excise...

    More like this

    Medak | యథేచ్ఛగా మొరం దందా.. అడ్డుకున్న గ్రామస్తులు

    అక్షరటుడే, మెదక్​ : Medak | మొరం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు (Permissions) తీసుకోకుండా అక్రమంగా మొరం...

    Tirumala | ఏఐ టెక్నాల‌జీతో వేగంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | భక్తుల భాగస్వామ్యంతో స‌నాత‌న ధ‌ర్మ‌ ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తామ‌ని టీటీడీ ఛైర్మ‌న్...

    Jeevan Reddy | తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు

    అక్షర టుడే, ఆర్మూర్‌ : Jeevan Reddy | కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు వచ్చాయని...