అక్షరటుడే, ఆర్మూర్: Sriramsagar Project | బాల్కొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాల్లో మువ్వన్నల జెండాను ఎగురవేసి జాతీయగీతాలాపన చేశారు.
Sriramsagar Project | భారీ గాలుల మధ్య.. వర్షం కురుస్తుండగా..
బాల్కొండలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో జాలర్లు సాహసం చేశారు. ప్రాజెక్ట్ నడిబొడ్డును జాతీయజెండాను (National flag) ఎగురవేశారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. విపరీతంగా వీస్తున్న గాలుల మధ్య.. వర్షం కురుస్తుండగా.. వారు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
Sriramsagar Project | ప్రాజెక్టుకు 25,676 క్యూసెక్కుల ఇన్ఫ్లో
తెలంగాణ (Telanagan) వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 46.654 టీఎంసీలు (1080.60) అడుగులకు చేరింది. భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి శుక్రవారం ఉదయం 6 గంటలకు 13,950 క్యూసెక్కులు, 9 గంటలకు 18,755 క్యూసెక్కులు, 12 గంటలకు 25,676 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గతేడాది ఇదే సమయనికి ప్రాజెక్టులో 48.071 టీఎంసీలు (1081.10)అడుగులు నీటి నిల్వ ఉంది.
Sriramsagar Project | ప్రాజెక్టు గేట్లకు త్రివర్ణ దీపాల అలంకరణ..
స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను త్రివర్ణ రంగుల దీపాలతో అలంకరించారు. గురువారం రాత్రి త్రివర్ణ రంగుల విద్యుత్ దీపాల నడుమ ప్రాజెక్టు గేట్లు శోభాయమానంగా కనిపించింది. ఈ వెలుగులను చూడటానికి పరిసర ప్రాంత ప్రజలు ప్రాజెక్టు దగ్గరికి తరలివచ్చారు..
త్రివర్ణపతాక రంగుల వెలుగుల్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
Sriramsagar Project | కాల్వల ద్వారా నీటి విడుదల..
కాకతీయ కాలువ ద్వారా 5వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, అలీ సాగర్ (Alisagar) ఎత్తిపోతలకు 180 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 502 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోందని ఏఈఈ కొత్త రవి తెలిపారు.
లోకేశ్వరం మండలం గుడిసెరా గ్రామం వద్ద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో జాతీయ జెండాను ఎగురవేసిన జాలర్లు