ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. 18న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. 18న ఆర్జిత సేవా టికెట్ల విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఆన్​లైన్​లో ​(TTD Online) సైతం టికెట్లు విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీవారి ఆర్జిత సేవా నవంబర్​ కోటాకు సంబంధించిన టికెట్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. నవంబర్​ కోటా టికెట్ల కోసం ఈ నెల 18 ఉదయం 10 గంటల నుంచి డీఐపీ రిజిస్ట్రేషన్(DIP Registration) అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ నెల 18 నుంచి 20 వరకు రిజిస్ట్రేషన్లు ఉంటాయి.

    Tirumala | బుకింగ్​ అప్పుడే..

    తిరుమల శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు సంబంధించిన నవంబర్​ నెల(November Month) టికెట్లు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఇవే ఆన్​లైన్​(వర్చువల్​) సేవల కోసం మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లు విడుదల చేస్తారు. అంగప్రదక్షిణం టోకెన్లు 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి దర్శనం, వసతి కోటా టికెట్లు 23న ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నారు.

    Tirumala | సీనియర్​ సిటిజెన్ల కోటా

    తిరుమల శ్రీవారిని దర్శించుకునే దివ్యాంగులు, సీనియర్​ సిటిజెన్ల(Senior Citizens) నవంబర్​ కోటా టికెట్లను 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి బుకింగ్​ చేసుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు 25న ఉదయం 10 గంటలకు ఆన్​లైన్​లో అందుబాటులో ఉంచుతారు. తిరుమల, తిరుపతి వసతి కోటా టికెట్లను 25న మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్​ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

    Tirumala | పద్మావతి అమ్మవారి దర్శనం కోసం

    పద్మావతి అమ్మవారి ఆలయం(Padmavati Ammavari Temple), తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.200) సెప్టెంబర్​ టికెట్లను ఈ 25న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. టీటీడీ (TTD) స్థానిక దేవాలయాల సేవా కోట 26న ఉదయం 10 గంటలకు, సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం కోటా టికెట్లు 26న ఉదయం 10 గంటలకు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంటాయి.

    Latest articles

    Dog Bite | వీధి కుక్కల స్వైర విహారం: ఇరవై మందికి గాయాలు..

    అక్షరటుడే, కామారెడ్డి: Dog Bite | రాజంపేట మండల (Rajampet mandal) కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్...

    Vikram Solar IPO | 19న స్టార్ట్ అవనున్న ఐపీవో.. గ్రేమార్కెట్లో ప్రీమియం ఎంతంటే?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vikram Solar IPO | దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో ఐపీవో వస్తోంది. విక్రమ్...

    Independence Day | స్వాతంత్య్ర వేడుకల‌కు రాహుల్‌, ఖ‌ర్గే దూరం.. విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Independence Day | ఢిల్లీలోని ఎర్ర‌కోటలో శుక్ర‌వారం నిర్వ‌హించిన స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు కాంగ్రెస్...

    Manikyam Tagore | ఆర్ఎస్ఎస్ ప్ర‌స్తావ‌న అందుకోస‌మే.. ప్ర‌ధాని మోదీపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manikyam Tagore | స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌కోట నుంచి జాతినుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి...

    More like this