అక్షరటుడే, ఇందల్వాయి: NH44 | ట్రాక్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయ్యింది. చంద్రాయన్పల్లి, దగ్గి గ్రామాల మధ్య 44వ జాతీయ రహదారిపై (National highway 44) ఓ ట్రక్కు డ్రైవర్ తన వాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో రోడ్డు పక్కన టైర్లు దిగబడిపోవడంతో భారీ ట్రక్కు రోడ్డుపై నిలిచిపోయింది.
దీంతో దగ్గి నుండి చంద్రాయన్ పల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కును జేసీపీ సహాయంతో తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.