అక్షరటుడే, వెబ్‌డెస్క్: constable ready for fifth marriage : మంచి సర్కారు ఉద్యోగం.. అందమైన భార్య.. చింతలు లేని జీవితం.. ఇవి సరిపోలేదు.. ఆ కామాంధుడైన కానిస్టేబుల్‌కు.. చేతికి చిక్కిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ పోయాడు. చివరికి మైనర్ బాలికను కూడా వదలలేదు.. ఇప్పుడేమో మరో యువతిపై కన్నేశాడు.. ఇలా ఐదో పెళ్లికి సిద్ధం అయ్యాడు కృష్ణం రాజు అనే కానిస్టేబుల్.
సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన ఖాకీ లీలలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. చివరికి ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే అతగాడిని సస్పెండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
constable ready for fifth marriage : వరుస పెళ్లిళ్లు..
సూర్యాపేట జిల్లా(Suryapet district)లోని నడిగూడెం(Nadigudem )ఠాణా(police station)లో కృష్ణంరాజు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కృష్ణంరాజు 2012 బ్యాచ్‌కు చెందినవాడు. ఇతగాడికి నల్లగొండ జిల్లాకు చెందిన యువతితో మొదటి పెళ్లి జరిగింది.
కాగా, ఐతే వివాహం అయిన కొద్ది రోజులకే ఆమెను వదలేశాడు. విడాకులు తీసుకుని, ఖమ్మం జిల్లా(Khammam district)కు చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
కానీ, ఖమ్మం అమ్మాయితోనూ సక్రమంగా నడుచుకోలేదు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఇంక బంధం తెగలేదు. కానీ, ముచ్చటగా మూడో పెళ్లి కూడా చేసేసుకున్నాడు.
అంతటితో ఆగాడా.. అంటే అదీ లేదు. సూర్యాపేటకు చెందిన పదో తరగతి బాలిక మెడలో తాళి(నాలుగో పెళ్లి) కట్టేశాడు. ఈ కామాంధుడి శారీరక వేధింపులు తాళలేక ఆ అమాయక బాలిక తల్లిగారి ఇంటికి పలాయనం చిత్తగించింది.
దీంతో ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడట ఈ నిత్య కామాంధ పెళ్లి కొడుకు. ఇదే ప్రచారంలోకి రావడం, దీనికితోడు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తుండటంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇతగాడిపై విచారణకు ఆదేశించి వెంటనే సస్పెండ్ చేశారు.