అక్షరటుడే, కోటగిరి :Sriveda High School | కోటగిరి, పోతంగల్ ఉమ్మడి మండలాలలో శ్రీవేద హైస్కూల్ విద్యార్థులు మండల స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులు సాధించారు. శ్రీవేద హైస్కూల్ విద్యార్థి(Sriveda High School student) విక్రం(Vikram) 559 మార్కులతో మండల టాపర్గా నిలిచారు. ఆయేషారా (Ayeshara) 539 మార్కులు సాధించారు. పాఠశాలకు చెందిన జోయ 524, ఆఫ్రిన్ 522, అర్జున్ 518, అక్షయ 511, మౌనిక 508, అరుంధతి 502 మార్కులు సాధించారు. మండల స్థాయిలో అత్యధిక మార్కులు సాధించి టాపర్లుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ తెల్ల రవికుమార్, కరస్పాండెంట్ తెల్ల అక్షర అభినందించారు.