అక్షరటుడే, వెబ్‌డెస్క్: goat with human face : మనిషి ముఖంతో మేక పిల్ల జన్మించింది.. బ్రహ్మంగారి(Brahmangari) కాలజ్ఞానం గుర్తుచేసింది.. ఈ వింత ఘటన తమిళనాడు(Tamil Nadu)లోని కల్లకురిచ్చి జిల్లాలో చోటుచేసుకుంది.
కల్లకురిచ్చి జిల్లా(Kallakurichi district)లోని ఉళుందూర్ పేట సమీపంలో ఉన్న సేందమంగళం ఊరిలో మనిషి ముఖం పోలిన మేక జననం చర్చనీయాంశంగా మారింది. ఆనందన్ అనే రైతు(farmer)కు చెందిన మేక ఈనగా ఈ వింత జీవి జన్మించింది.
goat with human face : ఎవరికి తోచింది వారు..
చూపునకు భయానకంగా ఉన్నా.. ఈ వింతను చూసేందుకు జనం తండోపతండోలుగా తరలివస్తున్నారు. కొందరు దీనిని దైవ సందేశంగా పేర్కొంటున్నారు. మరికొందరు దీనిని చెడుకు సంకేతంగా చెబుతున్నారు. ఇలా ఎవరికి తోచింది వారు అనుకుంటున్నారు స్థానికులు. శాస్త్రీయంగా ఇది జన్యులోపంతో వైకల్యంగా జన్మించినట్లు మరికొందరు పేర్కొంటున్నారు.
తన ఇంట్లో ఆనందన్(38) 20కి పైగా మేకలను పెంచుతున్నాడు. వాటిల్లో ఒకటి రెండు పిల్లలను ఈనింది. ఒకటి సాధారణంగా ఉండగా.. మరోటి ఇలా మనిషి ముఖం పోలికలతో చనిపోయి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది.
కాగా, మరణించిన ఆ వింత జీవిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.