ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​RK Beach | విశాఖ ఆర్కే బీచ్​లో విషాదం.. మహిళ మృతి, మరొకరి గల్లంతు

    RK Beach | విశాఖ ఆర్కే బీచ్​లో విషాదం.. మహిళ మృతి, మరొకరి గల్లంతు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RK Beach | బంగాళాఖాతం (Bay of Bengal)లో అల్ప పీడన (LPA) ప్రభావంతో ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం వద్ద అలల తాకిడి అధికంగా ఉంది. ఈ క్రమంలో ప్రజలు జలాశయాలు, నదులు, సుమద్రాల వద్దకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. అయినా పర్యాటకులు ప్రకృతి అందాలను చూడటానికి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా విశాఖ పట్నం (Visakhapatnam) ఆర్కే బీచ్​లో ముగ్గురు గల్లంతయ్యారు.

    విశాఖ ఆర్కే బీచ్‌(RK Beach)లో గురువారం విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో స్నానానికి ముగ్గురు గల్లంతయ్యారు. ఇందులో ఒకరు ఒడ్డుకు చేరుకొగా మరో మహిళ మృతి చెందింది. గల్లంతైన మరొకరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మెరైన్ పోలీసులు సముద్రంలో గల్లంతైన వ్యక్తి ఆచూకీ తీవ్రంగా ప్రయాణిస్తున్నారు. మరోవైపు మహిళా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

    RK Beach | సరదాగా స్నానానికి వెళ్లి..

    హైదరాబాద్​ (Hyderabad)కు చెందిన ఓ కుటుంబం పెళ్లి కోసం విశాఖపట్నం వెళ్లింది. బీచ్‌లో సరదాగా ఎంజాయ్​ చేయడానికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సముద్రంలోకి దిగారు. అయితే భారీ అలలు వారిని లోపలికి లాక్కెళ్లింది. సముద్రంలో ఒక్కసారిగా తమను కెరటాల లాక్కెళ్లాయని.. సురక్షితంగా బయటకు వచ్చిన వ్యక్తి తెలిపారు. అల్పపీడనం కారణంగా సముద్ర కెరటాల భారీ ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా పెళ్లి కోసం వచ్చిన వారిలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.

    Latest articles

    constable ready for fifth marriage | కామాంధ కానిస్టేబుల్​.. ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు.. అధికారులు ఏం చేశారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: constable ready for fifth marriage : మంచి సర్కారు ఉద్యోగం.. అందమైన భార్య.. చింతలు...

    Kagadala rally | యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘ఓట్ చోర్.. గద్దె చోడ్’ కాగడాల ర్యాలీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kagadala rally : ఓట్ చోర్ .. గద్దె చోడ్ అనే నినాదంతో...

    goat with human face | మనిషి ముఖంతో మేక పిల్ల జననం..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: goat with human face : మనిషి ముఖంతో మేక పిల్ల జన్మించింది.. బ్రహ్మంగారి(Brahmangari) కాలజ్ఞానం...

    ORR | ఓఆర్​ఆర్​ సర్వీస్ ​రోడ్డుపైకి దూసుకొచ్చిన పెద్ద బండరాళ్లు.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ORR | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో నాలుగైదు రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ...

    More like this