అక్షరటుడే, కామారెడ్డి: Gas cylinders | ఇళ్లలో అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్నట్లుగా సివిల్ సప్లయ్ (Civil Supply) అధికారులు గుర్తించారు.
ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు (Tiffin Centers), బేకరీలు, రెస్టారెంట్లపై (Restaurants) దాడిచేసి 53 సిలిండర్లను సీజ్ చేశారు. పలు హోటళ్లపై కేసులు నమోదు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో గృహ సంబంధ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేపట్టారు.
రెండు టీంలుగా ఏర్పడి చేసిన దాడుల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న 53 సిలిండర్లను అధికారులు గుర్తించారు. సంబంధిత నిర్వాహకులపై ఎల్పీజీ కంట్రోల్ ఆర్డర్-2000 (LPG Control Order) కింద కేసులు నమెదు చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
గృహ సంబంధ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడకూడదని, కచ్చితంగా వాణిజ్య సిలిండర్లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి స్వామి, డీటీలు సురేశ్, కిష్టయ్య, ఖలీద్, ఖాజా షరీఫ్, తిరుపతి పాల్గొన్నారు.