అక్షరటుడే, ఆర్మూర్/భీమ్‌గల్: Krishnashtami | కృష్ణాష్టమి వేడుకలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు పాఠశాలల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను విద్యార్థులకు ఉపాధ్యాయులు తెలియజేశారు. అలాగే శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలో చిన్నారులు అలరించారు.
అలాగే ఆర్మూర్ శివారులోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో (Oxford School) గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. పాఠశాల పరిపాలన అధికారిని శ్రీమతి పద్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Krishnashtami | స్మైల్ ద స్కూల్లో..
ఆర్మూర్ పట్టణంలోని స్మైల్స్ ద స్కూల్లో (Smiles the School) గురువారం కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. చిన్నారులు కృష్ణ, రాధ వేషధారణలో ఆకట్టుకున్నారు. కరస్పాండెంట్ ప్రిన్సిపల్ షబానా గౌహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Krishnashtami | లిటిల్ ఫ్లవర్ స్కూల్లో..
భీమ్‌గల్ (Bheemgal) పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో (Little Flower High School) కృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణుడి విగ్రహాన్ని పూలతో అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల నృత్యాలు, ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ షఫీ, మేనేజింగ్ డైరెక్టర్ సనా, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్ నాయర్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ ద స్కూల్లో కృష్ణాష్టమి వేడుక
భీమ్‌గల్ పట్టణంలోని లిటిల్‌ఫ్లవర్ పాఠశాలలో..
గాంధారిలోని విజేత స్కూల్లో గోకులాష్టమి వేడుకలు