అక్షరటుడే, వెబ్డెస్క్ : Cloud Burst | జమ్మూ కశ్మీర్లో (Jammu Kashmir) వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్త్వార్ జిల్లాల్లో గురువారం క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వాన కురిసింది. దీంతో భారీ వరద (Heavy Floods) రావడంతో పలువురు కొట్టుకుపోయారు. కిష్త్వార్ ప్రాంతంలో గల మచైల్ మాతా గుడికి భక్తులు వెళ్తుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నది దాటుతున్న క్రమంలో భారీ వరద ముంచెత్తడంతో పలువురు భక్తులు కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న ఆర్మీ, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతయిన 12 మంది మృతదేహాలను అధికారులు వెలికి తీసినట్లు సమాచారం.
Cloud Burst | ఒక్కసారిగా వర్షం పడడంతో..
కిష్త్వార్ ప్రాంతంలోని చసోటి గ్రామంలో ఒక్కసారిగా కుండపోత వాన కురిసింది. మచైల్ మాతా (Machayel Matha) యాత్రకు వెళ్లే దారిలో మారుమూల గ్రామంలో భారీ మేఘావృతం సంభవించడంతో వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడ్డాయి. అనేక ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సహాయక చర్యలను (Rescue Operation) కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేష్ సింగ్ పర్యవేక్షిస్తున్నారు. కాగా ఇటీవల ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ అయి ధరాలి (Dharali) గ్రామం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.
Cloud Burst | సహాయక చర్యలు చేపడుతున్నాం
కిష్త్వార్ ప్రాంతంలో వరదల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చర్చించినట్లు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) తెలిపారు. సహాయక చర్యలు చేపడుతుమన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు.
Cloud Burst | సంతాపం తెలిపిన లెఫ్టినెంట్ గవర్నర్
కుండపోత వర్షం కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. రక్షణ, సహాయ కార్యకలాపాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
View this post on Instagram