అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు నివాస ప్రాంతాలు, మురికి కాల్వల్లో పూడికతీత పనులను గురువారం కలెక్టర్ వినయ్కృష్ణా రెడ్డి (Collector Vinay Krishna Reddy), సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పరిశీలించారు. వర్షం నీరు నిల్వ ఉండకుండా పూడికతీత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని వారు నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు.
కొత్తగా అవసరమైనచోట మురికి కాల్వల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులను (municipal engineering officials) ఆదేశించారు. నగరంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా జలమయంగా మారకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్తాచెదారం తొలగింపజేయాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తక్షణమే జేసీబీలు పెట్టి డీ-సిల్టింగ్ పనులను పూర్తి చేయించాలన్నారు. గతంలో వరద తాకిటికి గురైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.
Collector Nizamabad | పోలీస్ కమాండ్ కంట్రోల్ రూం సందర్శన
పోలీస్ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూంను (Command Control Room) సీపీతో కలిసి కలెక్టర్ సందర్శించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాల వల్ల నెలకొన్న పరిస్థితులను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు చేశారు. వారి వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఈఈ మురళీమోహన్ తదితరులున్నారు.