అక్షరటుడే, బోధన్: VHPS | పట్టణంలో నిర్వహించనున్న వికలాంగుల సదస్సును విజయవంతం చేయాలని వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు సుజాత సూర్యవంశి (Sujatha Suryavanshi) పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో (Congress Party Election Manifesto) ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల వితంతుల పెన్షన్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈనెల 23న బోధన్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వికలాంగుల సదస్సును నిర్వహిస్తున్నామని.. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) వస్తున్నారని వివరించారు. సదస్సుకు వికలాంగులు, పింఛన్దారులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి భూమయ్య, ఎంఎంఎస్ జాతీయ నాయకురాలు యమున, ఎమ్మార్పీఎస్ నాయకులు భూమయ్య చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.