ePaper
More
    HomeజాతీయంElection Commission | రాహుల్ ఓట్ల చోరీ ఆరోప‌ణ‌ల‌పై ఈసీ అస‌హ‌నం.. అవి మురికి వ్యాఖ్య‌లని...

    Election Commission | రాహుల్ ఓట్ల చోరీ ఆరోప‌ణ‌ల‌పై ఈసీ అస‌హ‌నం.. అవి మురికి వ్యాఖ్య‌లని మండిపాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Election Commission | కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీపై ఎన్నిక‌ల సంఘం గురువారం మ‌రోసారి తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. రాహుల్‌తో పాటు ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఓట్ల చోరీ ఆరోప‌ణ‌లు ఎన్నిక‌ల పార‌దర్శ‌క‌త‌పై దాడి చేయ‌డ‌మేన‌ని పేర్కొంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఇండి కూట‌మి పార్టీలు ఓటు చోరీ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడంపై గురువారం మ‌రోసారి స్పందించింది. ఇటువంటి మురికి పదాలు పదేపదే తప్పుడు కథనాన్ని సృష్టించే లక్ష్యంతో ఉన్నాయని పేర్కొంది. ఇది కోట్లాది మంది భారతీయ ఓటర్లపై (Indian Voters) ప్రత్యక్షంగా దాడి చేయ‌డ‌మేన‌ని, లక్షలాది మంది ఎన్నికల సిబ్బంది సమగ్రతను శంకించ‌డ‌మేన‌ని ఈసీ పేర్కొంది.

    Election Commission | అఫిడ‌విట్ దాఖ‌లు చేయండి..

    భారతదేశంలో మొదటి ఎన్నికలు జ‌రిగిన 1951-52 నుంచి “ఒక వ్యక్తికి ఒక ఓటు” చట్టం అమలులో ఉందని ఎన్నిక‌ల సంఘం (Election Commission) నొక్కి చెప్పింది. ఒక వ్యక్తి రెండుసార్లు ఓటు వేసినట్లు ఆధారాలు లేక‌పోయినా ఆరోప‌ణ‌లు చేయ‌డం, ఓటర్లంద‌రినీ “చోర్” అని ముద్ర వేయడానికి బదులుగా ప్రమాణ స్వీకారం చేసిన అఫిడవిట్‌ను సమర్పించాలని ఈసీ రాహుల్‌కు సూచించింది.

    Election Commission | ఈసీపై రాహుల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

    రాహుల్ గాంధీ కొంత‌కాలంగా ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. బీజేపీతో క‌లిసి ఈసీ ఓట్ల చోరీకి పాల్ప‌డుతోందని ఆరోపించారు. ఆగస్టు 7న రాహుల్ గాంధీ న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో (Press Conference) ప్రెజెంటేషన్‌ను నిర్వహించిన ఆయ‌న‌.. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో పెద్ద ఎత్తున “ఓటు చోరీ” (ఓటు దొంగతనం) జరిగిందని ఆరోపించారు, నకిలీ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు, ఒకే చిరునామాలలో బల్క్ రిజిస్ట్రేషన్లు వంటి పద్ధతుల ద్వారా లక్షకు పైగా ఓట్లు “దొంగిలించబడ్డాయని” ఆరోపించారు. అయితే, ఈ ఆరోప‌ణ‌ల‌పై డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని ఈసీ కోరింది. అయితే, డిక్ల‌రేష‌న్ ఇవ్వ‌డానికి రాహుల్ గాంధీ ముందుకు రాలేదు. పైగా తన మాటే శాస‌న‌మ‌ని, ప్ర‌జ‌ల మాట‌నే తాను చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల సంఘం నుంచి తీసుకున్న డేటానే మాత్ర‌మే తాను చెబుతున్నాన‌ని తెలిపారు.

    Latest articles

    Heavy Rains | భారీ వర్షాల‌తో ముంబై అతులాకుత‌లం

    అక్షరటుడే, ముంబై : Heavy Rains | ముంబై(Mumbai) భారీ వ‌ర్షాల‌తో అతులాక‌తుల‌మైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల...

    RITES Notification | ‘రైట్స్‌’లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RITES Notification | గురుగావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(RITES)...

    One Crore Salary | 300 సార్లు రిజెక్ట్​ చేసినా.. ఆశ వదులుకోలేదు.. రూ.కోటి వేతనంతో జాబ్​ కొట్టాడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : One Crore Salary | ప్రస్తుతం చాలా మంది యువత చిన్న చిన్న విషయాలకే...

    IPO | ఐపీవోకు శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌ కంపెనీ.. 19 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి మరో ఐపీవో (IPO) వస్తోంది. శ్రీజీ షిప్పింగ్‌...

    More like this