ePaper
More
    HomeజాతీయంRahul Gandhi | ప్రాణాల‌కు ముప్పు వ్యాఖ్య‌ల‌పై వెన‌క్కి.. రాహుల్‌గాంధీ త‌ర‌ఫు న్యాయ‌వాది వెల్ల‌డి

    Rahul Gandhi | ప్రాణాల‌కు ముప్పు వ్యాఖ్య‌ల‌పై వెన‌క్కి.. రాహుల్‌గాంధీ త‌ర‌ఫు న్యాయ‌వాది వెల్ల‌డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | వీడీ సావ‌ర్క‌ర్, నాథూరం గాడ్సేల భావ‌జాలం క‌లిగిన వ్య‌క్తుల‌తో త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌న్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ఈ మేర‌కు పుణే కోర్టులో (Pune Court) దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఉప‌సంహ‌రించుకున్నారు. లండ‌న్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో వీడీ సావ‌ర్క‌ర్‌(VD Savarkar)కు వ్య‌తిరేకంగా, కించ‌ప‌రిచేలా వ్యాఖ్య‌లు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై రాహుల్‌గాంధీ ప‌రువు నష్టం కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయ‌న త‌ర‌ఫున వాద‌న‌లు వినిపిస్తున్న న్యాయవాది మిలింద్ పవార్ (Lawyer Milind Pawar) బుధ‌వారం పుణే కోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. వీడీ సావ‌ర్క‌ర్, నాథూరం గాడ్సేల భావ‌జాలం క‌లిగిన వ్య‌క్తుల‌తో త‌న క్ల‌యింట్‌ ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని పిటిష‌న్ వేశారు.

    Rahul Gandhi | రాహుల్ అభ్యంత‌రాల‌తో..

    అయితే ఈ పిటిష‌న్‌పై రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో న్యాయ‌వాది ప‌వార్ వెన‌క్కి త‌గ్గారు. రాహుల్‌గాంధీ అనుమ‌తి లేకుండా ఆ ద‌ర‌ఖాస్తును తాను కోర్టుకు స‌మ‌ర్పించాన‌ని, అందులోని అంశాల‌పై ఆయ‌న తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశార‌ని వెల్ల‌డించారు. దీంతో తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాన‌ని గురువారం కోర్టుకు తెలిపారు. ఈ నేప‌థ్యంలో పిటిషన్ ఉపసంహరణను కోర్టు అంగీకరించిందని పవార్ తెలిపారు.

    దివంగత స్వాతంత్య్ర‌ సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావ‌ర్క‌ర్ మేన‌ల్లుడు సత్యకి సావర్కర్ పరువు నష్టం కోరుతూ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసు త్వ‌ర‌లోనే విచార‌ణ‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో రాహుల్ త‌ర‌ఫు న్యాయ‌వాది మిలింద్‌ పవార్ బుధ‌వారం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సావర్కర్ అనుచరులు గాంధీకి ప్రాణహాని కలిగిస్తున్నారని పేర్కొన్నారు.

    Latest articles

    Trump-Putin | ఫ‌లించ‌ని ట్రంప్, పుతిన్ మంత్రాంగం.. మ‌రోసారి మాస్కోలో భేటీ కావాల‌ని నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump-Putin | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్...

    Toll Pass | తెలంగాణలో అమలులోకి రాని టోల్​పాస్​.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Pass | జాతీయ రహదారుల (National Highways)పై ఉన్న టోల్ గేట్ల వద్ద...

    Atal Bihari | మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి ఏడో వ‌ర్ధంతి.. ఘ‌నంగా నివాళులు అర్పించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Atal Bihari | మాజీ ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ప‌లువురు ప్ర‌ముఖులు శ‌నివారం...

    Indalwai | గిరిజన నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులను పోలీసులు శనివారం తెల్లవారుజామున ముందస్తుగా...

    More like this