ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​SriramSagar Project | క్రమంగా పెరుగుతున్న శ్రీరాంసాగర్​ నీటిమట్టం

    SriramSagar Project | క్రమంగా పెరుగుతున్న శ్రీరాంసాగర్​ నీటిమట్టం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: SriramSagar Project | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది.

    ప్రాజెక్టులో బుధవారం ఉదయం 5,498 క్యూసెక్కుల వరద వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు 12,769 క్యూసెక్కులకు పెరిగింది. గురువారం 13,540 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పరిధిలోని 6,24,000 ఎకరాలకు ప్రస్తుతం నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయనికి ప్రాజెక్టులో 47.847 టీఎంసీలు, 1081.00 అడుగులు నీటి నిల్వ ఉంది. గురువారం నాటిలో ప్రాజెక్టులో 45.758 టీఎంసీలు, 1080.03 అడుగుల నీటి నిల్వ ఉంది.

    SriramSagar Project | కాల్వల ద్వారా నీటి విడుదల

    జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. 482 క్యూసెక్కుల నీరు ఆవిరిగా వెళ్తోంది. వరద కాలువ, లక్ష్మి కాలువ (laxmi kaluva), గుత్ప, అలీసాగర్ (Alisagar) ఎత్తిపోతలకు నీటి విడుదలను బుధవారం నిలిపేశారు. కాకతీయ కాలువ (kakatiya kaluva) పరిధిలోని జోన్-1 ఏడు రోజులు జోన్-2కు 8 రోజుల పాటు నీటిని అందించనున్నారు. మిగిలిన కాల్వలకు ఏడు రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు.

    Latest articles

    Heavy Rains | భారీ వర్షాల‌తో ముంబై అతులాకుత‌లం

    అక్షరటుడే, ముంబై : Heavy Rains | ముంబై(Mumbai) భారీ వ‌ర్షాల‌తో అతులాక‌తుల‌మైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల...

    RITES Notification | ‘రైట్స్‌’లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RITES Notification | గురుగావ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌(RITES)...

    One Crore Salary | 300 సార్లు రిజెక్ట్​ చేసినా.. ఆశ వదులుకోలేదు.. రూ.కోటి వేతనంతో జాబ్​ కొట్టాడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : One Crore Salary | ప్రస్తుతం చాలా మంది యువత చిన్న చిన్న విషయాలకే...

    IPO | ఐపీవోకు శ్రీజీ షిప్పింగ్‌ గ్లోబల్‌ కంపెనీ.. 19 నుంచి సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోకి మరో ఐపీవో (IPO) వస్తోంది. శ్రీజీ షిప్పింగ్‌...

    More like this