ePaper
More
    HomeజాతీయంPresidents Medals | తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు

    Presidents Medals | తెలంగాణలో ఇద్దరికి రాష్ట్రపతి పతకాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Presidents Medals | స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాయుధ బలగాల్లో పని చేస్తున్న అధికారులకు ఏటా కేంద్ర ప్రభుత్వం పలు పతకాలు (central government awards) అందజేస్తోంది. ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు గురువారం అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలంగాణకు (Telangana) ఒక గ్యాలంటరీ పథకం, రెండు రాష్ట్రపతి అవార్డులు, 11 మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. ఏఎస్సై సిద్ధయ్య, నిడమానురి హుస్సేన్‌ ప్రెసిడెంట్‌ మెడల్స్‌కు (Presidents Medals) ఎంపికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్​ రాష్ట్రానికి సైతం రెండు రాష్ట్రపతి పతకాలు, 20 మెరిటోరియస్‌ సర్వీస్‌ మెడల్స్‌ ప్రకటించారు.

    Presidents Medals | మొత్తం 1,090 మందికి..

    స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి శౌర్య, సేవా పతకాల జాబితాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఈ సంవత్సరం మొత్తం 1,090 మంది సిబ్బందిని ఆయా పురస్కాల కోసం ఎంపిక చేసింది. మొత్తం 99 మందికి రాష్ట్రపతి అవార్డులు ప్రకటించగా అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురు ఉన్నారు. విధుల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పతకాలు అందిస్తారు. ఇందులో ఎక్కువ శాతం జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) సిబ్బందికే దక్కాయి.

    Presidents Medals | 99 మందికి రాష్ట్రపతి అవార్డులు..

    ఈ ఏడాది 233 శౌర్య పతకాలు, 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 758 ప్రశంసనీయ సేవా పతకాలను కేంద్రం ప్రభుత్వం అందించనుంది. పోలీస్​ శాఖలో పని చేస్తున్న 226 మందికి శౌర్య, 89 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 635 మందికి ప్రశంసనీయ సేవా పతకాలను అధికారులు ప్రకటించారు.

    అగ్ని మాపక శాఖలో ఆరుగురికి 6 శౌర్య పతకాలు, ఐదుగురికి రాష్ట్రపతి అవార్డులు, 51 ప్రశంసనీయ సేవా పతకాలు అందించనున్నారు. హోంగార్డు, సివిల్ డిఫెన్స్ విభాగంలో (Home Guard and Civil Defense departments) ఒక శౌర్య పతకం, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 41 ప్రశంసనీయ సేవా పతకాలను ప్రకటించారు. జైళ్లశాఖలో సైతం ఇద్దరు రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక​య్యారు. 31 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్రం శుక్రవారం ఈ అవార్డులు అందించనుంది.

    Latest articles

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...

    Run Out | క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఘ‌ట‌న‌.. అస‌లు ఇలా కూడా ర‌నౌట్ అవుతారా..?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ...

    More like this

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...