ePaper
More
    HomeసినిమాBalakrishna | పుష్ప‌2 జాత‌ర సాంగ్‌కి బాల‌య్య స్టెప్స్.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Balakrishna | పుష్ప‌2 జాత‌ర సాంగ్‌కి బాల‌య్య స్టెప్స్.. వైర‌ల్ అవుతున్న వీడియో

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం(Pushpa 2 Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో (Director Sukumar) వచ్చిన ఈ సినిమా, సాంకేతికంగా, నటన పరంగా ఓ మాస్టర్ పీస్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘జాతర’ పాటలో అల్లు అర్జున్ (Hero Allu Arjun) గంగమ్మ తల్లి గెటప్‌లో చేసిన స్టెప్స్ థియేటర్లలో అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే ఇప్పుడు ఈ మాస్ సాంగ్‌కు మరో మాస్ స్టార్ స్టెప్పులేశాడు. ఆయ‌న‌ ఎవరో కాదు, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Balakrishna). ఇటీవల మాల్దీవుల్లో జరిగిన ఓ ఫ్యామిలీ సంగీత్ వేడుకలో బాలయ్య ఈ పాటకు తనదైన స్టైల్‌లో చిందులు వేశారు. అల్లు అరవింద్ కూడా ఈ వేడుకలో పాల్గొనడం విశేషం.

    Balakrishna | అదిరింద‌య్యా బాల‌య్య‌..

    బాలయ్య చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ బాలయ్య ఎనర్జీని చూసి “పుష్ప పాటకు సింహం డ్యాన్స్ చేశాడు”, “తగ్గేదేలే బాలయ్య”, “ఈయన ఎంట్రీతో బీట్స్‌కి బలం పెరుగుతుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవైపు బన్నీ మ్యాజిక్, మరోవైపు బాలయ్య మాస్ ఎనర్జీ.. ఈ మ్యూజికల్ కలయికకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ చెప్ప‌డం కాదు కానీ, ఈ వీడియో చూస్తుంటే బాలయ్య వేదికపై ఉన్నాడంటే ఫుల్ ఎనర్జీ రావ‌డం గ్యారంటీ. వేడుక‌లో బాల‌య్య‌తో పాటు మిగ‌తా వారు కూడా త‌మ మెడ‌లో నిమ్మ‌కాయ దండ‌లు వేసుకొని త‌గ్గేదే లే అన్నట్టు ఫోజులు ఇవ్వ‌డం హైలైట్‌. ఇక తొడ‌కొడుతూ స‌ర‌దాగా చిల్ అవుతూ క‌నిపించారు.

    అల్లు అర‌వింద్ , బాల‌య్య చాలా రోజుల త‌ర్వాత ఒకే వేదిక‌పై క‌నిపించ‌డం కూడా అభిమానుల‌కు కాస్త ఉత్సాహ‌న్ని క‌లిగించింది. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇదే కాంబోలో ఓ సినిమా వ‌స్తే బాగుండు అని నెటిజ‌న్స్ ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే బాల‌య్య ఇప్పుడు అఖండ 2 అనే చిత్రం చేస్తున్నాడు. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది.

    Latest articles

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...

    Run Out | క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఘ‌ట‌న‌.. అస‌లు ఇలా కూడా ర‌నౌట్ అవుతారా..?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ...

    More like this