ePaper
More
    Homeబిజినెస్​Minimum Balance | మినిమం బ్యాలెన్స్​పై వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్​.. కస్టమర్లకు షాక్​ ఇచ్చిన...

    Minimum Balance | మినిమం బ్యాలెన్స్​పై వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్​.. కస్టమర్లకు షాక్​ ఇచ్చిన హెచ్​​డీఎఫ్​సీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum Balance | సేవింగ్స్​ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్​ లేకపోతే పలు బ్యాంకులు జరిమానా వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ ప్రైవేట్​ రంగ బ్యాంక్​ ఐసీఐసీఐ ఇటీవల మినిమం బ్యాలెన్స్ (Minimum Balance)​ మొత్తాన్ని భారీగా పెంచింది. ఆగస్టు 1 నుంచి ఖాతా తీసుకున్న వారికి గతంలో ఉన్న దానికంటే ఐదు రెట్లు పెంచింది. బ్యాంక్​ నిర్ణయంపై వినియోగదారుల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీంతో బ్యాంక్​ వెనక్కి తగ్గింది.

    ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank)​ ఇటీవల మెట్రో నగరాల్లో మినిమం బ్యాలెన్స్​ రూ.10 వేల నుంచి రూ.50 వేలకు, సెమీ అర్బన్​ ఏరియాల్లో రూ.5 వేల నుంచి రూ.25 వేలకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.10 వేలకు పెంచింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మినిమం బ్యాలెన్స్​ మొత్తాన్ని తగ్గిస్తూ బ్యాంక్​ నిర్ణయం తీసుకుంది. మెట్రో నగరాల్లో ఖాతాదారులు రూ.15 వేల సగటు బ్యాలెన్స్​ మెయింటెన్​ చేస్తే సరిపోతుందని చెప్పింది. అలాగే సెమీ అర్బన్​ ఏరియాలో రూ.7,500 మినిమం బ్యాలెన్స్​ ఉంచుకోవాలని పేర్కొంది. గ్రామీణ ప్రాంతంలోకి కస్టమర్లకు గతంలో ఉన్న రూ.2,500నే కొనసాగించాలని నిర్ణయించింది.

    Minimum Balance | హెచ్​డీఎఫ్​సీ వంతు

    హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ (HDFC Bank)​ తన కస్టమర్లకు షాక్​ ఇచ్చింది. ఆగస్టు 1 తర్వాత కొత్తగా సేవింగ్స్​ అకౌంట్​ తీసుకునే వారికి మినిమం బ్యాలెన్స్​ మొత్తాన్ని పెంచింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో గతంలో ఓపెన్ చేయాలంటే రూ.10వేలు మినిమం బ్యాలెన్స్ లిమిట్​ ఉండేది. తాజాగా దానిని రూ.25వేలకు పెంచుతూ బ్యాంక్​ నిర్ణయం తీసుకుంది. ఖాతాదారులు సగటు కనీస నిల్వలు ఉంచకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పింది. మినిమం బ్యాలెన్స్​ కంటే ఎంత తక్కువ ఉంటే అందులో ఆరు శాతం లేదా, రూ.600 (ఏది తక్కువైతే అది) పెనాల్టీ కట్టాలని స్పష్టం చేసింది.

    Minimum Balance | ప్రభుత్వ బ్యాంకులు అలా

    దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్​ నిబంధనలను ఎత్తి వేస్తుండగా.. ప్రైవేట్​ బ్యాంకులు (Private Banks) భారీగా పెంచుతుండడం గమనార్హం. మినిమం బ్యాలెన్స్​ల విషయంలో ఆర్బీఐకి నియంత్రణ ఉండదని ఇటీవల గవర్నర్​ సంజయ్​ మల్హోత్ర తెలిపారు. దీంతో ప్రైవేట్​ బ్యాంకులు ఇష్టారాజ్యంగా మినిమం బ్యాలెన్స్​ అమౌంట్ పెంచుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్​లు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ నిబంధనలు అమలు చేయడం లేదు.

    Latest articles

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...

    Run Out | క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఘ‌ట‌న‌.. అస‌లు ఇలా కూడా ర‌నౌట్ అవుతారా..?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ...

    More like this

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...