ePaper
More
    HomeజాతీయంMadhya Pradesh | గాఢ నిద్ర‌లో రితిక్.. లేచి ఉంటే చచ్చే వాడు.. వీడియో వైర‌ల్

    Madhya Pradesh | గాఢ నిద్ర‌లో రితిక్.. లేచి ఉంటే చచ్చే వాడు.. వీడియో వైర‌ల్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున జ‌రిగిన‌ దొంగతనం అంద‌రు ఉలిక్కిప‌డేలా చేసింది. విజయ్ నగర్(Vijay Nagar) ప్రాంతంలో నివసిస్తున్న రిటైర్డ్ జస్టిస్ రమేశ్ గర్గ్ నివాసంలో దొంగలు ప్రవేశించి లక్షల విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. దొంగతనం జరిగే సమయంలో ఇంట్లో ఉన్న యువకుడు నిద్రలో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. సుమారు ముగ్గురు దొంగలు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు. వారిలో ఇద్దరు రమేశ్ గర్గ్ కుమారుడు రితిక్ గదిలోకి ప్రవేశించగా, మూడో వ్యక్తి ఇంటి బయట కాపలాగా ఉన్నాడు.

    Madhya Pradesh | నిద్ర లేచి ఉంటే అంతే..

    ఆ సమయంలో రితిక్ మంచంలో గాఢ నిద్రలో ఉండ‌గా, బోర్లా ప‌డుకొని గురకపెట్టి నిద్రపోతున్నాడు. ఒక దొంగ చేతిలో ఇనుప రాడ్ ఉండగా, అతడు రితిక్ నిద్రలేస్తే వెంటనే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు క‌నిపించింది. మరో దొంగ (Thief) మాత్రం అల్మారాలో నుంచి నగదు, ఆభరణాలు అపహరించేశాడు.అయితే రితిక్ అదృష్టవశాత్తూ నిద్ర నుండి మేలుకోలేదు. దాంతో దొంగలు ఎలాంటి హింసా చర్యలకు దిగకుండా, కేవలం నాలుగు నిమిషాల్లో దొంగతనాన్ని ముగించి అక్కడినుంచి పారిపోయారు. రితిక్ లేచి ఉంటే అదే స‌మ‌యంలో నూరేళ్లు నిండేవి.

    అయితే ఇంటి బ‌య‌ట సెక్యూరిటీ గార్డులు(Security Guards) ఉన్నా కూడా, దొంగలు అవ‌లీల‌గా లోపలికి చొరబడి, రూ. 5 లక్షల నగదు, భారీ విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు. దీనిపై విచారణ ప్రారంభించిన పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజ్ (CC Camera Footage) ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంట్లో నిద్రపోతున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడటం రియల్ లైఫ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు గార్డులు ఉన్నా, ఇంత పెద్ద దొంగతనం జరగడం క‌ల‌క‌లం రేపుతుంది.

    Latest articles

    Mla Pocharam | వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో బాన్సువాడ

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | వరి ఉత్పత్తిలో (Rice production) బాన్సువాడ నియోజకవ (Banswada Constituency) తెలంగాణలో...

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరకే ఆరోగ్య పరీక్షలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day)...

    SBI Notification | ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | క్లరికల్‌ కేడర్‌(Clerical cadre)లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌, సేల్స్‌)...

    Realme P4 | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో రియల్‌మీ నుంచి మరో ఫోన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme P4 | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ అయిన రియల్‌మీ (Realme).. పీ...

    More like this