ePaper
More
    HomeసినిమాWar 2 Review | వార్ 2 రివ్యూ.. ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ సినిమా హిట్టేనా..?

    War 2 Review | వార్ 2 రివ్యూ.. ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ సినిమా హిట్టేనా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : War 2 Review | స్వాతంత్య్ర దినోత్స‌వం శుభాకాంక్ష‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిత్రం వార్ 2. బాలీవుడ్‌లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలింస్ (Yash Raj Films) బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. హృతిక్ రోషన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఈ చిత్రంలో నటించ‌గా, క‌థానాయిక‌గా కియారా అద్వానీ (Kiara Advani) న‌టించింది. ఈ సినిమా ద్వారా తారక్ హిందీ ప‌రిశ్ర‌మకు పరిచయం కాగా, హృతిక్ తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ అయ్యారు. కొద్ది సేపటి క్రితం ఈ మూవీ థియేటర్స్‌లోకి రాగా, మూవీ ఎలా ఉందో చూద్దాం.

    War 2 Review | క‌థ‌:

    క‌బీర్ (Hrithik Roshan) కొన్నాళ్ల నుండి అజ్ఞాతంలో ఉంటాడు. అయితే ఆయ‌న‌ని ప‌ట్టుకోవాల‌ని స్పెష‌ల్ ఆఫీసర్స్‌ని నియ‌మిస్తారు. అయితే ఎంత మందిని నియ‌మించిన కూడా క‌బీర్‌ని ప‌ట్టుకోవ‌డం వారి వ‌ల్ల కాదు. దాంతో ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి విక్ర‌మ్ (ఎన్టీఆర్‌ని) స్పై ఆఫీసర్ (spy officer)గా ఎంపిక చేసి హృతిక్ రోషన్ ని పట్టుకోడానికి అపాయింట్ చేస్తారు. ఆ త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది, ఎన్టీఆర్ త‌న డ్యూటీని ఫినిష్ చేశాడా, ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    War 2 Review | న‌టీన‌టుల ప‌ర్‌ఫార్మెన్స్:

    చిత్రంలో ఎన్టీఆర్ అండ్ హృతిక్ త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. యాక్షన్ సీన్స్‌లో (action scenes) ఇద్ద‌రు కూడా నువ్వా నేనా.. అన్నట్టు ఢీకొన్నారు. విక్రమ్‌ వర్సెస్ కబీర్.. వీళ్లద్దరూ ఎదురుపడి పోట్లాడుకునే ఎపిసోడ్ మాత్రం ప్రేక్ష‌కుల‌కి చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కొన్ని సీన్స్‌లో హృతిక్‌ను ఎన్టీఆర్‌ డామినేట్ చేస్తే.. మరి కొన్ని సీన్లలో హృతిక్ అద‌ర‌గొట్టాడు. ఎన్టీఆర్ షర్ట్ లేస్ సీన్ గూస్ బంప్స్ తెప్పించింది. షర్ట్ లెస్ అవతారంలో ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు పిచ్చెక్కిపోయారు కియారా ఉన్నకాడికి గ్లామ‌ర్ షో బాగా చేసింది. మసాలా ప్రియులకైతే ఈమె తెగ నచ్చేస్తుంది అనే చెప్పాలి. బికినీలో ఆమె అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల‌కి పిచ్చెక్కించింది అనే చెప్పాలి. మిగ‌తా న‌టీన‌టులు కూడా త‌మ ప‌ర్‌ఫార్మెన్స్ తో అద‌ర‌గొట్టారు.

    War 2 Review | టెక్నిక‌ల్ ప‌ర్‌ఫార్మెన్స్..

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ప్ర‌ధాన బ‌లం అని చెప్పాలి. స్లో అవుతుంద‌న్న స‌మ‌యంలో మ్యూజిక్‌తోనే లేపారు. బీజీఎం (BGM) ఇంకాస్త బాగా ఇచ్చి ఉంటే సినిమా నెక్ట్స్ లెవ‌ల్‌లో ఉండేది. ఎమోషనల్ , ఎలివేషన్ సన్నివేశాల్లో బీజీఎం బాగానే ఇచ్చాడు. కొన్ని విజువ‌ల్స్‌లో వీఎఫ్ఎక్స్ తేడా కొట్టింది. కొన్ని సన్నివేశాలలో యానిమేషన్స్ తో ఎలాగైతే బొమ్మలను క్రియేట్ చేస్తారో అలాంటి బొమ్మలను చూసినట్టే ప్రేక్ష‌కుడికి ఫీల్ క‌లుగుతుంది. గ్రాఫిక్స్ స‌రిగ్గా కుద‌ర‌క‌డ పోవ‌డం వ‌ల్ల సినిమాపై కాస్త నెగెటివ్ ఇంపాక్ట్ వ‌చ్చింది. ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని కొన్ని సీన్స్‌కి కత్తెర పెడితే బాగుండేది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

    నటీనటులు: హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వాని, అశుతోష్ రానా, అనీల్ క‌పూర్
    ద‌ర్శకత్వం: అయాన్ ముఖ‌ర్జీ
    నిర్మాత: ఆదిత్య చోప్రా
    సంగీతం : ప్రీత‌మ్, సంచిత్,
    బ్యానర్: యష్ రాజ్ ఫిల్మ్స్
    రిలీజ్ డేట్: 14-08-2025

    War 2 Review | ప్లస్ పాయింట్స్

    ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్టింగ్
    ఇంటర్వెల్ సీన్
    ఫస్టాఫ్ యాక్ష‌న్ సీన్స్

    War 2 Review | మైనస్ పాయింట్స్

    మ్యూజిక్
    సెకండాఫ్ లో కొన్ని సీన్స్
    వీఎఫ్ఎక్స్

    War 2 Review | విశ్లేషణ

    బ్ర‌హ్మాస్త్ర సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు ‘అయాన్ ముఖర్జీ’ (Ayan Mukerji) ఈ సినిమా కథని చాలా రొటీన్ గా రాసుకున్నాడు అనే చెప్పాలి. గ‌తంలో స్పై ఆఫీసర్ కథకి సంబంధించిన సినిమాలు చాలానే రాగా, ఇది కూడా అలానే అనిపిస్తుంది. విజువల్ గా కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు కానీ కొన్నిసీన్స్ వీఎఫ్ఎక్స్ వ‌ల‌న తేలిపోతాయి. ఇద్ద‌రు హీరోల‌ని బాగానే హ్యాండిల్ చేశాడు. ఫ‌స్టాఫ్‌లోని కొన్ని స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుడిని ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యేలా చేశారు. ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్, డబ్బింగ్ పర్లేదు. డైలాగ్స్ కూడా సెట్ అయ్యాయి. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి చేసిన ఫైట్ సీక్వెన్స్ అయితే ఫ్యాన్స్‌కి మంచి వినోదాన్ని పంచుతాయి. హృతిక్ రోషన్ ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని అర్ధ‌మ‌వుతుంది. ఇద్ద‌రు హీరోలు పోటి ప‌డి న‌టించారు. ఫ్యాన్స్‌కి ఈ సినిమా న‌చ్చి తీరుతుంది.

    రేటింగ్ : 2.5/5

    Latest articles

    Uttar Pradesh | దారుణాతి దారుణం..రెండేళ్ల కుమారుడికి కన్నతండ్రే పురుగుల‌ మందు తాగించి ఆపై మేడపై నుంచి తోసేశాడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని Uttar Pradesh చిటౌవ గ్రామంలో హృదయాలను కలచివేసే సంఘటన చోటు...

    Pocharam project | నిండు కుండలా పోచారం ప్రాజెక్టు.. దూకుతున్న అలుగు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project : కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట్ (Nagireddypet) మండలాల వరప్రదాయిని...

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా Medchal district సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి...

    Vitamin B12 | ఈ సమస్యలతో బాధపడుతున్నారా.. విటమిన్ బి12 లోపం ఉన్నట్లే

    అక్షరటుడే, హైదరాబాద్: Vitamin B12 | విటమిన్ బి12 లోపం అనేది చాలా సాధారణమైన సమస్య. ఇది మన...

    More like this

    Uttar Pradesh | దారుణాతి దారుణం..రెండేళ్ల కుమారుడికి కన్నతండ్రే పురుగుల‌ మందు తాగించి ఆపై మేడపై నుంచి తోసేశాడు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని Uttar Pradesh చిటౌవ గ్రామంలో హృదయాలను కలచివేసే సంఘటన చోటు...

    Pocharam project | నిండు కుండలా పోచారం ప్రాజెక్టు.. దూకుతున్న అలుగు

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Pocharam project : కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో ఎల్లారెడ్డి (Yellareddy), నాగిరెడ్డిపేట్ (Nagireddypet) మండలాల వరప్రదాయిని...

    surrogacy case | మేడ్చల్‌ జిల్లా సరోగసి కేసులో సంచలనాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: surrogacy case | మేడ్చల్‌ జిల్లా Medchal district సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి...