అక్షరటుడే, ఇందూరు : Nizamabad | జిల్లాలో మున్నూరు కాపుల సభ్యత్వ నమోదు (Membership Drive) ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో వారు మాట్లాడారు. రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు సభ్యత్వ నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు అన్ని తర్పల మున్నూరు కాపులు (Munnur Kapu) తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన కులగణన (Caste Census)లో మున్నూరు కాపుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. అందుకే సభ్యత్వ నమోదు చేసి నిజమైన సంఖ్యను నిరూపించుకోవాలనేదే ముఖ్య ఉద్దేశం అన్నారు. గతంలో జిల్లాలో నలుగురు మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉండేవారని ప్రస్తుతం ఒక ఎంపీ మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. కాపు యువత ముందుకొచ్చి విస్తృతంగా సభ్యత్వ నమోదు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు మహిళా అధ్యక్షురాలు ఆకుల లలిత, జిల్లా కార్యదర్శి గార్ల లింగం తదితరులు పాల్గొన్నారు.