ePaper
More
    HomeతెలంగాణHeavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Heavy Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ (Warangal)​, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ముంపు బాధితులు పునరావావస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఈ రోజు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

    అల్ప పీడన ప్రభావంతో గురువారం ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. వికారాబాద్​, మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్​, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్​, ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్​ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.

    Heavy Rain Alert | హైదరాబాద్​ నగరంలో..

    హైదరాబాద్ (Hyderabad)​ మహా నగరాన్ని వర్షం వీడటం లేదు. గత నాలుగు రోజులుగా నిత్యం వర్షం పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ట్రాఫిక్​లో చిక్కుకుంటున్నారు. ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు నగరంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత మోస్తరు వానలు పడుతాయి. నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడడంతో ట్రాఫిక్​ పోలీసులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ఈ రోజు ఐటీ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోమ్ (Work From Home)​ ఇవ్వాలని కంపెనీలను కోరారు. అలాగే జీహెచ్​ఎంసీ (GHMC) పరిధిలో పాఠశాలలు సైతం మధ్యాహ్నం వరకే కొనసాగనున్నాయి.

    Heavy Rain Alert | పాఠశాలలకు సెలవు

    పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్​ జారీ చేశారు. దీంతో అధికారులు ఆయా జిల్లాల్లో పాఠశాలలకు గురువారం సెలవులు (Holiday) ప్రకటించారు. మెదక్​, సంగారెడ్డి, వికారాబాద్​, ఖమ్మం, వరంగల్​, జనగామ, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్​ జిల్లాల్లో బడులకు సెలవు ఇచ్చారు. మరోవైపు ప్రజలు సైతం అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. చెరువులు, నదులు, వాగులు, ప్రాజెక్ట్​ల వద్దకు వెళ్లొద్దన్నారు.

    Latest articles

    Gold Rates | అతివ‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. మ‌రింత త‌గ్గిన బంగారం ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Rates | ఆగ‌స్టు మొద‌టి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధ‌ర‌లు ఇప్పుడు...

    Run Out | క్రికెట్ చ‌రిత్ర‌లోనే వింత ఘ‌ట‌న‌.. అస‌లు ఇలా కూడా ర‌నౌట్ అవుతారా?

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Run Out : క్రికెట్ చరిత్రలో ఎన్నో ఆసక్తికరమైన రనౌట్స్ చూశాం. కానీ తాజాగా ఓ...

    Brussels sprout | చూడటానికి చిన్నదే.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలూ వదలరు..

    అక్షరటుడే, హైదరాబాద్: Brussels sprout | మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను...

    Beetroot Idly | పోషకాలతో నిండిన బీట్‌రూట్ ఇడ్లీ.. ఇలా చేస్తే పిల్లలు ముక్క మిగల్చకుండా తింటారు

    అక్షరటుడే, హైదరాబాద్: Beetroot Idly | సాధారణంగా చేసే ఇడ్లీ కంటే భిన్నంగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండే బీట్‌రూట్...

    More like this