ePaper
More
    Homeక్రీడలుArjun Tendulkar | అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. బిజినెస్ రంగానికి చెందిన సానియా చందోక్‌తో కొత్త...

    Arjun Tendulkar | అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం.. బిజినెస్ రంగానికి చెందిన సానియా చందోక్‌తో కొత్త జర్నీ ప్రారంభం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Arjun Tendulkar : లెజెండరీ క్రికెటర్, ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుటుంబంలో త్వ‌ర‌లో పెళ్లి బాజాలు మోగ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌(Sania Chandok)తో నిశ్చితార్థం చేసుకున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

    ఈ వేడుక ముంబైలోని ఒక ప్రైవేట్ వేదికపై అత్యంత సన్నిహితుల మ‌ధ్య‌ ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇరు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో అర్జున్, సానియా రింగ్స్ మార్చుకున్నార‌ట‌.

    Arjun Tendulkar : శుభ‌వార్త‌..

    టెండూల్కర్ కుటుంబం కాని, సానియా కుటుంబం కాని దీనిపై ఇంత వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఇక అర్జున్ టెండూల్క‌ర్ Arjun Tendulkar.. సానియా చందోక్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడ‌న్న వార్త బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమె గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు నెటిజ‌న్స్.

    సానియా చందోక్ ముంబైకి చెందిన ఘాయ్ వ్యాపార కుటుంబానికి చెందినవారు. తక్కువ కేలరీల ఐస్ క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ, ముంబైలోని ప్రముఖ ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ హోటల్ లతో ఈ కుటుంబం అనుసంధానమై ఉంది. సానియా Mr. Paws Pet Spa & Store LLP లో డిజిగ్నేటెడ్ పార్టనర్‌గా పని చేస్తూ, లో-ప్రొఫైల్‌ జీవితం గడుపుతూ బిజినెస్ రంగంలో సొంత గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

    క్రికెట్‌లో అర్జున్ (Arjun Tendulkar) తనదైన గుర్తింపు కోసం కృషి చేస్తూ, గోవా తరఫున దేశీయ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అర్జున్.. 532 పరుగులు (సగటు: 23.13), 37 వికెట్లు (బౌలింగ్ సగటు: 33.51) తీశాడు. 18 లిస్ట్-A మ్యాచ్‌లు విష‌యానికి వ‌స్తే.. 102 పరుగులు (సగటు: 17), 25 వికెట్లు (బౌలింగ్ సగటు: 31.2) తీసాడు. ఐపీఎల్‌లో IPL ముంబై ఇండియన్స్ తరఫున కొన్ని మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడిగా కాకుండా, స్వతంత్రంగా క్రికెట్‌లో ఎదగాలనే సంకల్పంతో అర్జున్ టెండూల్కర్ ముందుకు సాగుతున్నాడు.

    Latest articles

    Rainy Season | వ‌ర్షాకాలం.. ఆరోగ్యం భ‌ద్రం.. వ్యాధుల నుంచి ర‌క్షించుకోవ‌డం సుల‌భం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rainy Season | కాలాలు మారుతున్న త‌రుణంలో వాతావ‌ర‌ణంలో అనేక మార్పులు వ‌స్తాయి. ఈ...

    SriramSagar Project | క్రమంగా పెరుగుతున్న శ్రీరాంసాగర్​ నీటిమట్టం

    అక్షరటుడే, ఆర్మూర్: SriramSagar Project | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ కురుస్తున్న...

    Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Urban MLA | సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ శాసనసభ్యుడు ధన్​పాల్...

    Heavy Rains | దేశ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు.. స్తంభించిన జ‌న‌జీవ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉత్త‌రాది రాష్ట్రాలు వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతున్నాయి....

    More like this