ePaper
More
    HomeజాతీయంStudent refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    Student refuses Governor | గవర్నర్​ నుంచి డిగ్రీ పట్టా తీసుకునేందుకు నిరాకరించిన విద్యార్థిని

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Student refuses Governor : ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని అనూహ్యంగా ప్రవర్తించింది. స్నాతకోత్సవం(convocation)లో ముఖ్య అతిథి గవర్నర్​ను కాదని వైస్​ ఛాన్సలర్ (Vice Chancellor)​ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకుంది. గవర్నర్​ పిలుస్తున్నా.. పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన తమిళనాడు(Tamil Nadu)లో చోటుచేసుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది.

    తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం(Manonmaniyam Sundaranar University)లో ఇటీవల స్నాతకోత్సవం (Convocation) నిర్వహించారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి (RN Ravi) ముఖ్య అతిథిగా విచ్చేశారు.

    వేడుకలో విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందిస్తున్నారు. విద్యార్థులు వరుసగా వచ్చి తీసుకుంటున్నారు. కాగా, జీన్ జోసెఫ్ అనే విద్యార్థిని గవర్నర్​ను కాదని ముందుకు వెళ్లిపోయింది. పిలుస్తున్నా పట్టించుకోలేదు. గవర్నర్​ పక్కన ఉన్న విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (university Vice Chancellor Chandrashekhar) వద్దకు వెళ్లింది. ఆయన ద్వారా డిగ్రీ పట్టా అందుకుంది.

    ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది. ఒక రాష్ట్ర ప్రథమ పౌరుడి పట్ల ఒక సాధారణ విద్యార్థిని వ్యవహరించిన తీరుపై విమర్శలు వెలువడుతున్నాయి.

    కాగా, అధికార డీఎంకే (DMK) పార్టీకి చెందిన నాగర్ కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ (Nagercoil Deputy Secretary M Rajan) భార్యగా సదరు విద్యార్థిని జీన్ జోసెఫ్​ను గుర్తించారు. అధికార డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్​(Tamil Nadu Governor RN Ravi)కు మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఉద్దేశపూర్వకంగానే స్టేజీపై జీన్​ జోసెఫ్ (Jean Joseph) ఇలా ప్రవర్తించినట్లు అంటున్నారు.

    Student refuses Governor : బిల్లులు ఆమోదించకుండా..

    తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవికి పంపారు. కాగా, ఈ బిల్లులపై గవర్నర్​ సమాధానం ఇవ్వకుండా వాటిని ఆయన వద్దే ఉంచుకుంటున్నారని తమిళనాడు సర్కారు ఆవేదన.. దీనిపై సర్కారు 2023లో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. బిల్లులను సమ్మతించడం లేదని, పునఃపరిశీలించాలని కూడా వెనక్కి పంపడం లేదని వాపోయింది. బిల్లులను రెండోసారి ఆమోదించి పంపినా ఫలితం లేకుండా పోయిందని వాపోయింది. కాగా, ఇది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

    Latest articles

    Krishnashtami | పాఠశాలల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు..

    అక్షరటుడే, ఆర్మూర్/భీమ్​గల్​: Krishnashtami | కృష్ణాష్టమి వేడుకలను ఆయా పాఠశాలల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను...

    IND vs PAK Match | భార‌త్ మాతో మ్యాచ్ ఆడ‌క‌పోతే బాగుండు.. దేవుడికి ప్రార్ధ‌న‌లు చేస్తున్న పాక్ క్రికెట‌ర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IND vs PAK Match | సెప్టెంబర్ 14న జరగనున్న భారత్ vs పాకిస్తాన్(Ind...

    Nalgonda | బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన కోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nalgonda | నల్గొండలోని (Nalgonda) దారుణ హత్యాచార కేసులో జిల్లా కోర్టు సంచ‌ల‌న తీర్పు...

    Stock Market | రోజంతా ఒడిదుడుకులు.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | సెన్సెక్స్‌, నిఫ్టీలలో వరుస ఆరు వారాల నష్టాలకు బ్రేక్‌ పడిరది....

    More like this