ePaper
More
    HomeజాతీయంGirlfriend turns thief | ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

    Girlfriend turns thief | ప్రియుడి కోసం దొంగగా మారిన ప్రియురాలు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Girlfriend turns thief | ఇటీవల వక్ర ప్రేమ కథలు ఎక్కవగా ప్రచారం అవుతున్నాయి. ప్రియుడి కోసం కొందరు యువతులు, మహిళలు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి ఏకంగా దొంగ అవతారమే ఎత్తింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​(Chhattisgarh)లోని ఉత్తర బస్తర్ (North Bastar) కాంకేర్​లో వెలుగుచూసింది.

    కాంకేర్ అదనపు ఎస్పీ దినేశ్ సిన్హా కథనం ప్రకారం.. దుమర్పాణి గ్రామానికి చెందిన కన్షయ్య ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం కూరగాయలు అమ్మడానికి మార్కెట్​కు వెళ్లాడు. రాత్రి ఎనిమిదింటికి ఇంటికి వచ్చే సరికి, తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో దాచిపెట్టిన రూ.95 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

    దీంతో తన ఇంట్లో చోరీ జరిగిందని ఆగస్టు 9వ తేదీన హల్బా చౌకీ ఠాణాలో కన్హయ్య ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన రోజున ఇద్దరు అనుమానితులు గ్రామంలో సంచరించినట్లు తేలింది.

    వారిని తామ్రధ్వజ్​​ విశ్వకర్శ (24), కరుణ పటేల్ (22)గా గుర్తించిన పోలీసులు పక్కా ప్లాన్​తో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కరుణ తన నేరం అంగీకరించింది. ఆమె దొంగగా మారడానికి గల కారణాన్ని చెబితే పోలీసులే షాక్​ అయ్యారు.

    Girlfriend turns thief | ప్రేమ కోసం చోరీ..

    నిందితురాలు కరుణ ఆమె ప్రియుడు తామ్రధ్వజ్​​ విశ్వకర్శ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆమె ప్రియుడు బైక్​ కొనాలని అనుకున్నాడు. కానీ అంత మొత్తంలో డబ్బులు అతగాడి వద్ద లేవు. దీంతో ప్రియుడి బైక్​ కోరిక తీర్చేందుకు కరుణ దొంగగా మారింది.

    వీరి స్నేహితుడి ఇంటిలోనే దొంగతనం చేయాలని తన ప్రియుడితో కలిసి ప్రణాళిక రూపొందించింది. స్నేహితుడు ఇంటికి తాళం వేసి వెళ్లడం చూసి, తమ ప్లాన్​ అమలు చేశారు.

    తామ్రధ్వజ్ ఇంటి ఎదుట కాపలాగా ఉన్నాడు. కరుణ తాళం పగులకొట్టి ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో ఉన్న రూ.95 వేల నగదు, సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు(gold and silver ornaments) అపహరించింది.

    నిందితు నుంచి పోలీసులు చోరీ సొత్తును రికవరీ చేశారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి, రిమాండ్​కు తరలించారు.

    Latest articles

    Mla Pocharam | వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో బాన్సువాడ

    అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | వరి ఉత్పత్తిలో (Rice production) బాన్సువాడ నియోజకవర్గం (Banswada Constituency) తెలంగాణలో...

    Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో తక్కువ ధరకే ఆరోగ్య పరీక్షలు

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్ ​: Medicover Hospital | మెడికవర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day)...

    SBI Notification | ఎస్‌బీఐ నుంచి భారీ నోటిఫికేషన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | క్లరికల్‌ కేడర్‌(Clerical cadre)లో జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌, సేల్స్‌)...

    Realme P4 | శక్తిమంతమైన ప్రాసెసర్‌తో రియల్‌మీ నుంచి మరో ఫోన్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Realme P4 | చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ అయిన రియల్‌మీ (Realme).. పీ...

    More like this